Whale Ambergris : సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులకు ఏకంగా రూ.50 కోట్ల విలువైన తిమింగలం వాంతి లభ్యమైంది. ఆ వాంతి బరువు 38.6 కిలోలు ఉండగా.. దాన్ని అంబర్‌గ్రిస్‌గా పిలుస్తున్నారు. అయితే ఈ వాంతికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇంతకీ అసలు ఏం జరిగింది.. అన్న వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కడపాక్కం సమీపంలోని కడకుప్పం గ్రామానికి చెందిన ఇంద్రకుమార్, మాయకృష్ణన్, కర్ణన్, శేఖర్‌లు చేపల వేట కోసం కొద్ది రోజుల కిందట సముద్రంలోకి వెళ్లారు.
నడి సముద్రంలో వారు విసిరిన వల బరువుగా అనిపించింది. దీంతో తమ వలకు భారీ చేప చిక్కిందని భావించారు. పైకి లాగే సరికి అందులో చేపకు బదులు మరేదో ఉండటంతో నిశితంగా గమనించారు. చివరకు అది తిమింగలం వాంతిగా గుర్తించి ఈ విషయం గురించి అరుచ్చిపాక్కం అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలోనే అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని దానిని స్వాధీనం చేసుకున్నారు. కాగా వారు ఆ పదార్థాన్ని పరిశీలించి దాని బరువు 38.6 కిలోలు ఉందని.. ధర రూ.50 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. అయితే తిమింగలం వాంతిని సముద్రంలో తేలే బంగారం అంటారు.
తిమింగలం వాంతికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అరుదైన స్పెర్మ్ తిమింగలాల పొట్టలో మాత్రమే ఇది తయారవుతుంది. ఆ తిమింగలాలు స్క్విడ్ అనే సముద్రపు జీవులను మింగుతాయి. అవి దాని పొట్టలోకి వెళ్లిన తర్వాత ఆంబ్రెయిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. దాంతో స్క్విడ్ లు ముక్కలై ముద్దలా మారిపోతాయి. ఆ సమయంలో తిమింగలం దాన్ని కక్కితే.. అదే వాంతిగా నీటిపై తేలుతుంది. నీటిలో ఉన్నా అది క్రమంగా గట్టిపడి కొవ్వొత్తిలా మారిపోతుంది. అలా మారిన దాన్ని అంబర్‌గ్రిస్ అంటారు. ఇక ఈ అంబర్‌గ్రిస్ సువాసన వెదజల్లుతుంది.
అందువల్ల దాన్ని పెర్ఫ్యూమ్‌ల తయారీలో వాడుతారు. సెంట్లు ఎక్కువ కాలం సుగంధ పరిమళాలు వెదజల్లాలంటే.. ఈ వాంతి అవసరం ఉంటుంది. ఈ వాంతిని కాల్చినప్పుడు ముందుగా చెడువాసన వస్తుంది. కాసేపటికి తియ్యటి వాసనగా అది మారుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి భారీ గిరాకీ ఉంది. ఈ వాంతి ఒక్కో కిలో రూ.30,50,620 దాకా ఉంటుంది. థాయ్‌లాండ్ సహా పలు దేశాలకు చెందిన మత్స్యకారులు తిమింగలం వాంతితో ఇప్పటికే కోటీశ్వరులు అయ్యారు. ఇలాంటి సంఘటనలు ఇది వరకు చోటు చేసుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా తమిళనాడుకు చెందిన జాలర్లకు తిమింగలం వాంతి లభించడం విశేషం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…