Gas Trouble : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనుషులను ఎక్కువగా బాధిస్తున్న వాటిలో గ్యాస్ సమస్య కూడా ఒకటి. చాలామంది నిత్యం ఈ గ్యాస్ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ అనేది కొందరిలో సర్వ సాధారణంగా వస్తుంది. నేటి జీవన శైలి కారణంగా చాలామందిలో ఈ సమస్య రోజు రోజుకీ పెరుగుతోంది. మరి ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే మనకు ప్రకృతి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కలను ప్రసాదించింది. ప్రకృతి ప్రసాదించిన ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో అలొవెరా కూడా ఒకటి.
ఇప్పుడు అలొవెరా వల్ల మనం గ్యాస్ సమస్యకు ఎలా చెక్ పెట్టొచ్చు అనేది తెలుసుకుందాం. అలొవెరా మొక్క ఔషధ గుణాలకు బాగా ప్రసిద్ధి చెందింది. కలబందలో ఉండే శీతలీకరణ గుణాలు చర్మ సంబంధిత సమస్యలు, మలబద్ధకం, కీళ్ల నొప్పులు వంటి అనేక అనారోగ్య సమస్యలతోపాటు గ్యాస్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందడంలో సహాయపడతుంది. అలొవెరాలో ఉండే ఔషధ గుణాలు పొట్టలో అల్సర్, పేగు పూత, కడుపులో మంట, గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ను తగ్గించడంలో సహాయపడుతాయి.
ఈ విషయం సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయ్యింది. ఒక 79 మందిని గ్రూప్ గా డివైడ్ చేసి వారికి అలొవెరా జ్యూస్ ను ఉదయం 10ml సాయంత్రం 10ml ఇచ్చారు. అంతేకాకుండా 2 స్పూన్స్ అలొవెరా జెల్ కి ఒక స్పూన్ తేనె, హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ మూడింటినీ 100ml వాటర్ లో బాగా కలిపి తాగించారు. ఇంకొక 79 మందికి ఓమెప్రొజోల్ టాబ్లెట్ ఇచ్చారు. వీరిలో అలొవెరా జ్యూస్ తాగిన వారికి రెండు వారాల్లో ఫలితం బాగా కనిపించింది. అలొవెరా జ్యూస్ తీసుకున్న వారిలో 70 శాతం వరకు గ్యాస్ సమస్య తగ్గిపోయింది.
అలొవెరాలో ముఖ్యంగా యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి పొట్ట అంచుల వెంబడి గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా రక్షిస్తుంది. అలొవెరా జ్యూస్ ను నిత్యం తీసుకోవడం వలన పొట్టలో హెల్తీ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. ఇందులో ఉండే ప్లాంట్ కాంపౌండ్స్ వలన ప్రేగులలో నీటి శాతాన్ని పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా మలబద్ధకాన్ని నివారించి సుఖ విరేచనం అవ్వడానికి సహకరిస్తుంది. ఎప్పుడైతే సుఖ విరోచనం అవుతుందో అప్పుడు గ్యాస్ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…