Weight : అధిక బరువు ఉండడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లు వస్తాయి. అటువంటి పరిస్థితిలో బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. బరువు తగ్గించుకోవడం కష్టం అనుకుంటారు. కానీ సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే బరువును తగ్గించుకోవడం సాధ్యమే అంటున్నారు పరిశోధకులు. శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకొని బరువు తగ్గడానికి ఈ డ్రింక్ ను తాగితే బరువు తగ్గడం ఖాయం. రోజులో అరగంట వ్యాయామం చేసి ఈ డ్రింక్ తాగాలి.
ఈ డ్రింక్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి దానిలో ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ సోంపు, అర టీస్పూన్ మిరియాలు, అర చెక్క నిమ్మ కాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. 5 నుంచి 7 నిమిషాలు మరిగించి గ్లాస్ లోకి వడకట్టి రోజూ ఉదయం పరగడుపునే తాగితే 15 రోజుల్లోనే తేడా కనబడుతుంది.
ఇందులో ఉన్న జీలకర్ర బరువును తగ్గించడానికి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. జీలకర్రలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. జీలకర్ర ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే జీవక్రియ రేటును పెంచుతుంది. సోంపులో ఫైబర్ సమృద్దిగా ఉండడంతో కడుపు నిండిన భావన ఉండడమే కాకుండా ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మిరియాలు, నిమ్మకాయలలో ఉన్న లక్షణాలు కూడా బరువును తగ్గిస్తాయి.
ఈ డ్రింక్ ను తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ డ్రింక్ లో ఉపయోగించిన జీలకర్ర, మిరియాలు, సోంపు, నిమ్మకాయలలో ఉన్న లక్షణాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. పైగా ఈ పదార్థాలు అన్నీ మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవే. కనుక అధిక బరువు సులభంగా తగ్గుతారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…