Weight : 15 రోజులు ఈ డ్రింక్ ను తాగితే చాలు.. శరీరంలో కొవ్వు అంతా కరిగిపోయి సులభంగా బరువు తగ్గుతారు..!

August 23, 2022 12:37 PM

Weight : అధిక బరువు ఉండడం వ‌ల్ల‌ గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లు వ‌స్తాయి. అటువంటి పరిస్థితిలో బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. బరువు తగ్గించుకోవడం కష్టం అనుకుంటారు. కానీ సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే బరువును తగ్గించుకోవడం సాధ్యమే అంటున్నారు పరిశోధకులు. శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకొని బరువు తగ్గడానికి ఈ డ్రింక్ ను తాగితే బరువు తగ్గడం ఖాయం. రోజులో అరగంట వ్యాయామం చేసి ఈ డ్రింక్ తాగాలి.

ఈ డ్రింక్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి దానిలో ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ సోంపు, అర టీస్పూన్ మిరియాలు, అర చెక్క నిమ్మ కాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. 5 నుంచి 7 నిమిషాలు మరిగించి గ్లాస్ లోకి వడకట్టి రోజూ ఉదయం ప‌ర‌గ‌డుపునే తాగితే 15 రోజుల్లోనే తేడా కనబ‌డుతుంది.

take this Weight loss drink for 15 days to get better results
Weight

ఇందులో ఉన్న జీలకర్ర బరువును తగ్గించడానికి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. జీలకర్రలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. జీలకర్ర ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే జీవక్రియ రేటును పెంచుతుంది. సోంపులో ఫైబర్ సమృద్దిగా ఉండడంతో  కడుపు నిండిన భావన ఉండడ‌మే కాకుండా ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మిరియాలు, నిమ్మకాయల‌లో ఉన్న లక్షణాలు కూడా బరువును తగ్గిస్తాయి.

ఈ డ్రింక్ ను తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ డ్రింక్ లో ఉపయోగించిన జీలకర్ర, మిరియాలు, సోంపు, నిమ్మకాయలలో ఉన్న లక్షణాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడ‌తాయి. పైగా ఈ ప‌దార్థాలు అన్నీ మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవే. క‌నుక అధిక బ‌రువు సుల‌భంగా త‌గ్గుతారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment