ఈ పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగితే.. ఎంత లావుగా ఉన్నా సన్నగా అవుతారు..!

August 19, 2022 2:25 PM

గత కొన్నేళ్లుగా మన జీవనశైలిలో వచ్చిన మార్పులతో ఊబకాయం సమస్య పెరిగిపోతోంది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌ చేస్తున్నారు. దీంతో పొట్ట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదివరకే బొజ్జ ఉన్నవారికి అది భారీగా పెరగవచ్చు. కానీ ఇది మంచి లక్షణం కాదని, దీని ప్రభావం మెదడుపై ఉంటుంద‌ని బ్రిటన్ శాస్త్రవేత్తలు, నిపుణులు చేసిన సర్వేలో తేలింది.

అధిక బరువు కారణంగా డయాబెటిస్, గుండెపోటు, రక్తపోటు వంటి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల‌ బరువు తగ్గించుకునే ప్రయత్నాలను చేయాలి. బరువు తగ్గించుకోవడానికి ఒక పొడిని తయారు చేసుకుని ప్రతి రోజూ నీటిలో కలిపి తాగితే 15 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం. అదేంటంటే..

take this powder daily to get rid of fat and reduce weight

పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అర కప్పు సోంపు గింజలు, 15 యాలకులు, రెండు టీస్పూన్ల లవంగాలు, అర టీస్పూన్ మిరియాలు, అర అంగుళం దాల్చిన చెక్క ముక్క, చిన్న అతి మ‌ధురం ముక్క వేసి మంచి ఫ్లేవర్ వచ్చేవరకు వేయించాలి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా  చేయాలి.

ఆ తర్వాత రెండు స్పూన్ల శొంఠి పొడి, అర స్పూన్ జాజికాయ పొడి వేసి మరల ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఈ పొడిని ఒక సీసాలో నిల్వ చేసుకుంటే దాదాపుగా నెలరోజుల పాటు వాడుకోవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ పొడి కలిపి ఐదు నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత స్పూన్ తో బాగా కలిపి ఆ నీటిని తాగాలి. ఇలా రోజూ తాగడం వల్ల‌ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడ‌మే కాకుండా డయాబెటిస్, రక్తపోటు వంటి వ్యాధులు కూడా నియంత్రణలో ఉంటాయి. కాస్త ఓపికగా ఇటువంటి పొడులను తయారు చేసుకుని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. శ‌రీరంలోని కొవ్వు మొత్తం పోయి అధిక బ‌రువు త‌గ్గుతారు. ఇలా సుల‌భంగా బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now