Chiranjeevi : రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు కానీ అప్పట్లో శివ సినిమాతో టాలీవుడ్ గతినే మార్చేశాడు. శివ వచ్చి పాతికేళ్లు అయినా ఇంకా దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. అప్పటి వరకు చూడని యాక్షన్, స్క్రీన్ ప్లే, టేకింగ్, మేకింగ్ శివతో పరిచయం అయింది. దీంతో ఆర్జీవీ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. దీంతో అటు బాలీవుడ్ కు వెళ్లి రంగీలా, సత్య వంటి సూపర్ హిట్లు తీసి దేశం మొత్తం తన వైపు చూసేలా చేశాడు. ప్రస్తుతం వర్మ సినిమాలు నాసిరకంగా ఉంటున్నాయి. కానీ ఒకప్పుడు వర్మ తీసిన చిత్రాలన్నీ కల్ట్ క్లాసిక్ లుగానే మిగిలాయి.
తెలుగులో శివ సినిమాతో వర్మకు ఎంత గుర్తింపు వచ్చిందో.. హిందీలో ఈ రంగీలా సినిమాతో ఆ రేంజ్ గుర్తింపునే సంపాదించుకున్నాడు వర్మ. అయితే రంగీలా సినిమా తెలుగులోనే తెరకెక్కాల్సిందట. ఇందులో చిరంజీవి, రజినీకాంత్, శ్రీదేవి కలిసి నటించాలి. కానీ వారికీ ఈ సినిమా దక్కలేదు. ఈ విషయాన్ని నిర్మాత అశ్వినీదత్ తెలిపారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అశ్వినీదత్ మాట్లాడుతూ.. శివ సినిమా హిట్ తర్వాత నాతో సినిమా చేయాలని వర్మకు అడ్వాన్స్ ఇచ్చారు. అప్పుడే వర్మ నాకు రంగీలా, గోవిందా గోవిందా సినిమా కథలు చెప్పారు. ఇందులో రంగీలా రజిని, చిరు, శ్రీదేవితో కలిసి తీస్తే సూపర్ హిట్ అవుతుందని వర్మ అనుకున్నాడు. కానీ నాకు గోవిందా గోవిందా సినిమా కథ నచ్చింది. వెంకటేశ్వరుని హుండీ చుట్టూ ఆ కథ తిరుగుతుంది. అందుకే నేను ఆ సినిమాను ఓకే చేసి నాగార్జునతో తీశాను.
కానీ రంగీలా సినిమాలో కథ మొత్తం శ్రీదేవి చుట్టూ ఉంటుంది. చిరు, రజిని పాత్రలు అనేవి అంత ఇంపాక్ట్ చూపించవు అని అనుకున్నాను. అందుకే నేను ఆ సినిమా తీయలేదని అశ్వినీదత్ తెలిపారు. కానీ చివరకు రంగీలా సినిమాను వర్మ బాలీవుడ్ లో జాకీ ష్రాఫ్, అమీర్ ఖాన్, ఊర్మిళతో తీశాడు. ఆ సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మొత్తం బాలీవుడ్ ను షేక్ చేసింది రంగీలా. కానీ ఇక్కడ గోవిందా గోవిందా ఫ్లాప్ అయ్యింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…