గత కొన్నేళ్లుగా మన జీవనశైలిలో వచ్చిన మార్పులతో ఊబకాయం సమస్య పెరిగిపోతోంది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో పొట్ట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదివరకే బొజ్జ ఉన్నవారికి అది భారీగా పెరగవచ్చు. కానీ ఇది మంచి లక్షణం కాదని, దీని ప్రభావం మెదడుపై ఉంటుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు, నిపుణులు చేసిన సర్వేలో తేలింది.
అధిక బరువు కారణంగా డయాబెటిస్, గుండెపోటు, రక్తపోటు వంటి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల బరువు తగ్గించుకునే ప్రయత్నాలను చేయాలి. బరువు తగ్గించుకోవడానికి ఒక పొడిని తయారు చేసుకుని ప్రతి రోజూ నీటిలో కలిపి తాగితే 15 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం. అదేంటంటే..
పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అర కప్పు సోంపు గింజలు, 15 యాలకులు, రెండు టీస్పూన్ల లవంగాలు, అర టీస్పూన్ మిరియాలు, అర అంగుళం దాల్చిన చెక్క ముక్క, చిన్న అతి మధురం ముక్క వేసి మంచి ఫ్లేవర్ వచ్చేవరకు వేయించాలి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేయాలి.
ఆ తర్వాత రెండు స్పూన్ల శొంఠి పొడి, అర స్పూన్ జాజికాయ పొడి వేసి మరల ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఈ పొడిని ఒక సీసాలో నిల్వ చేసుకుంటే దాదాపుగా నెలరోజుల పాటు వాడుకోవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ పొడి కలిపి ఐదు నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత స్పూన్ తో బాగా కలిపి ఆ నీటిని తాగాలి. ఇలా రోజూ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడమే కాకుండా డయాబెటిస్, రక్తపోటు వంటి వ్యాధులు కూడా నియంత్రణలో ఉంటాయి. కాస్త ఓపికగా ఇటువంటి పొడులను తయారు చేసుకుని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలోని కొవ్వు మొత్తం పోయి అధిక బరువు తగ్గుతారు. ఇలా సులభంగా బరువును తగ్గించుకోవచ్చు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…