బింబిసార చిత్రంతో సెన్సేషనల్ సక్సెస్ ని అందుకున్నారు కళ్యాణ్ రామ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. యువ దర్శకుడు వశిష్ట కూడా ఈ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. దర్శకుడు వశిష్ట అందించిన పవర్‌ఫుల్ కథాంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బింబిసార చిత్రంతో ఇండస్ట్రీ మంచి ఊపందుకుందని చెప్పవచ్చు.
నిర్మాణ సంస్థకు భారీ లాభాలను రాబడుతూ బింబిసార బాక్సాఫీస్ వద్ద సక్సెస్ బాటగా దూసుకుపోతుంది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. ఏపీ, తెలంగాణలో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా బింబిసార రూ.15 నుండి రూ.16 కోట్లను వసూలు చేయడం విశేషం. ఇప్పుడు మరో కొత్త విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
నటసింహం బాలయ్య గానీ బింబిసార వంటి పవర్ ఫుల్ కథాంశంలో నటించి ఉంటే రికార్డులు దద్దరిల్లిపోయేవి అనే వార్త ప్రచారం అవుతోంది. ముందుగా ఈ చిత్రానికి గాను దర్శకుడు వశిష్ట బాలయ్య బాబును హీరోగా అనుకున్నారట. క్రూరంగా ప్రజలను, చంటి పిల్లలను చంపడం వంటి నెగిటివ్ షేడ్ లలో బాలయ్య బాబుని చూపించడం తగదని వశిష్ట వెనక్కి తగ్గి ఉండవచ్చు అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బాలయ్య బాబుకు లేకపోతే ఏమైంది.. కళ్యాణ్ రామ్ కూడా ఈ కథకు పర్ ఫెక్ట్ గా సెట్ అయిపోయారు. కళ్యాణ్ రామ్ నటన చూసినవారు థియేటర్లలో అదరహో అంటున్నారు. ఏదేమైనప్పటికీ వరుస విజయాలతో నందమూరి ఫ్యామిలీ అభిమానులకు కన్నుల పండుగ చేస్తున్నారు. అఖండతో బాలకృష్ణ, ఆర్ఆర్ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు బింబిసారతో కళ్యాణ్ రామ్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…