టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక ప్రసంగం గురించి ఆసక్తికర వివరాలను వెల్లడించారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుంది. అహ్మదాబాద్‌లో డ్రెస్సింగ్ రూమ్ టేబుల్‌పై టీ20 ప్రపంచకప్ ట్రోఫీ ఉంచిన తర్వాత గౌతమ్ గంభీర్ జట్టును ఉద్దేశించి మాట్లాడారు. ఈ ట్రోఫీ కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ఆయన పేర్కొన్నారు. ద్వైపాక్షిక సిరీస్‌లలో 100 మ్యాచ్‌లు గెలిచినా ప్రజలు గుర్తుంచుకోకపోవచ్చు కానీ ప్రపంచకప్ విజయాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ యాదవ్ గంభీర్ ప్రసంగంపై మరిన్ని వివరాలు వెల్లడించారు.
మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో మేం ఆయనకు నవ్వే అవకాశం కూడా ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత ఈ జట్టు ఆడిన విధానాన్ని చూసి ఆయన చాలా సంతోషించారు. ఎందుకంటే భారత్‌లో ఏ టీ20 జట్టు కూడా ఇంతలా బ్యాటింగ్ చేయలేదు అనుకుంటాను. 250, 256 వంటి భారీ స్కోర్లు చేయడం, లక్ష్యాలను విజయవంతంగా ఛేజ్ చేయడం జరిగింది. ఫైనల్ తర్వాత ఆయన అత్యంత ఎక్కువగా నవ్వారు.. అని భారత జట్టు కెప్టెన్ చెప్పారు. భారత్ వరుసగా రెండు టీ20 ప్రపంచకప్ టైటిళ్లు గెలుచుకోవడం గురించి కూడా సూర్యకుమార్ స్పందించారు. వరుసగా రెండు టైటిళ్లు గెలవడం చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తోంది.. అని ఆయన అన్నారు. ఐసీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ టోర్నమెంట్ మొత్తం జట్టు చేసిన సన్నాహకాలు, వ్యూహాల గురించి కూడా సూర్యకుమార్ వివరించారు.
ఈ టోర్నమెంట్ భారత్‌లోనే జరగబోతుందని మాకు ముందే తెలుసు. అందుకే మా సన్నాహకాలు పూర్తిగా సరిగ్గా జరిగాయి. పరిస్థితులు ఎలా ఉంటాయో, మేం ఏం చేయాలో, ఎలా ఆడాలో మాకు స్పష్టంగా తెలుసు. ఈ జట్టులో నెమ్మదిగా ఏర్పడిన ముఖ్యమైన అంశం పరస్పర శ్రద్ధ అని నేను భావిస్తున్నాను. టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత ప్రతి ఒక్కరు ఒకరినొకరు గురించి ఆలోచించడం, ఆ సమయంలో జట్టుకు ఏం అవసరమో గుర్తించడం మొదలైంది. ఇదే ఈ ఏడాది ఎడిషన్‌కు మా మంత్రంగా నిలిచింది.. అని యాదవ్ తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…