Garlic : మన అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో 60 ఏళ్లు దాటితే గానీ రక్తపోటు మాట అనే వినిపించేది కాదు. ఇప్పుడు మారుతున్న జీవనశైలి బట్టి చిన్నవయస్సులోనే రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మానసిక ఒత్తిడి వలన, చేసే పనిలో ఒత్తిడి వలన 90 శాతం మంది రక్తపోటు సమస్య బారినపడుతున్నారు. రక్తపోటునే వాడుక భాషలో బీపీ అని అంటాం. ఎప్పుడైతే రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉంటాయో, రక్తప్రసరణలో గడ్డలు ఏర్పడి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రక్తపోటు లాంటి ప్రమాదకరమైన జబ్బును అదుపులో ఉంచుకోవాలంటే మన పురాతన కాలం నుంచి ఎన్నో ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వంట గదిలో ఉండే వెల్లుల్లి గురించి మీరు వినే ఉంటారు. కానీ ఈ వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఇలా పచ్చి వెల్లుల్లితో మనకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లిలో అలిసిన్ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనం మన రక్తపోటు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తుంది. పచ్చి వెల్లుల్లి అనేది చాలా ఘాటుగా ఉంటుంది. వెల్లుల్లిని నేరుగా తినడం ద్వారా గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్ సమస్యతో బాధపడుతున్నవారు వెల్లుల్లికి దూరంగా ఉండటమే మంచిది. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలనుకునేవారు ఒక గిన్నెలో రెండు రెబ్బలు వెల్లుల్లిని ఉంచి దానిపై వేడి వేడి అన్నం వేసి కాసేపు వదిలేయాలి. ఈ అన్నం వేడికి ఆ వెల్లుల్లిలో ఉండే ఘాటుదనం అనేది తగ్గుతుంది. తర్వాత ఆ వెల్లుల్లిని అన్నంతో సహా తినేయవచ్చు.
నిత్యం వండుకునే కూరల్లో కూడా వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా రక్తపోటు, అధిక బరువు సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. వెల్లుల్లిని ఆహారంలో తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గి అధిక బరువు నియంత్రణలో ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…