Garlic : వెల్లుల్లిని ఇలా తింటే.. దెబ్బ‌కు బీపీ మొత్తం తగ్గుతుంది..!

August 19, 2022 2:33 PM

Garlic : మన అమ్మమ్మలు, తాతయ్యల‌ కాలంలో 60 ఏళ్లు దాటితే గానీ రక్తపోటు మాట అనే వినిపించేది కాదు. ఇప్పుడు మారుతున్న జీవనశైలి బట్టి చిన్నవయస్సులోనే రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మానసిక ఒత్తిడి వలన, చేసే పనిలో ఒత్తిడి వలన 90 శాతం మంది రక్తపోటు సమస్య బారినపడుతున్నారు. రక్తపోటునే వాడుక భాషలో బీపీ అని అంటాం. ఎప్పుడైతే రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉంటాయో, రక్తప్రసరణలో గడ్డలు ఏర్పడి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రక్తపోటు లాంటి ప్రమాదకరమైన జబ్బును అదుపులో ఉంచుకోవాలంటే మన పురాతన కాలం నుంచి ఎన్నో ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వంట గదిలో ఉండే వెల్లుల్లి  గురించి మీరు వినే ఉంటారు. కానీ ఈ వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఇలా పచ్చి వెల్లుల్లితో మనకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

take Garlic in this way to control high bp
Garlic

వెల్లుల్లిలో అలిసిన్ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనం మన రక్తపోటు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తుంది. పచ్చి వెల్లుల్లి అనేది చాలా ఘాటుగా ఉంటుంది. వెల్లుల్లిని నేరుగా తినడం ద్వారా గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్ సమస్యతో బాధపడుతున్నవారు వెల్లుల్లికి దూరంగా ఉండటమే మంచిది. రక్తపోటును అదుపులో ఉంచుకోవాల‌నుకునేవారు ఒక గిన్నెలో రెండు రెబ్బలు వెల్లుల్లిని ఉంచి దానిపై వేడి వేడి అన్నం వేసి కాసేపు వదిలేయాలి. ఈ అన్నం వేడికి ఆ వెల్లుల్లిలో ఉండే ఘాటుదనం అనేది తగ్గుతుంది. తర్వాత ఆ వెల్లుల్లిని అన్నంతో సహా తినేయవచ్చు.

నిత్యం వండుకునే కూరల్లో కూడా వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా రక్తపోటు, అధిక బరువు సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. వెల్లుల్లిని ఆహారంలో తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గి అధిక బరువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now