T20 World Cup 2021 : బాప్‌రే.. భార‌త్‌, పాకిస్థాన్ మ్యాచ్ ను 100 కోట్ల మంది చూస్తార‌ట‌..?

October 24, 2021 12:11 PM

T20 World Cup 2021 : భార‌త్‌, పాకిస్థాన్ ల మ‌ధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే చాలు.. క్రికెట్ చూడ‌ని వారు.. ఆ ఆట గురించి తెలియ‌ని వారు కూడా ఆస‌క్తి చూపిస్తుంటారు. దాయాది దేశాలు.. చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు.. క‌నుక‌నే భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య మ్యాచ్ అంటే.. ప‌నులు మానుకుని, ఆఫీసుల‌కు సెల‌వు పెట్టి, కాలేజీల‌కు బంక్ కొట్టి మ‌రీ మ్యాచ్‌ల‌ను చూస్తుంటారు. ఇక ఈ రోజు ఆదివారం క‌నుక సెల‌వు పెట్టాల్సిన ప‌నిలేదు. ఎంచ‌క్కా మ్యాచ్‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

T20 World Cup 2021  india vs pakisthan match may viewed by 100 crore audience

అయితే భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య వ‌రల్డ్ క‌ప్ మ్యాచ్ క‌నుక స‌హ‌జంగానే భార‌త క్రికెట్ అభిమానుల‌కు, ఇత‌ర వీక్ష‌కుల‌కు ఎంతో ఆస‌క్తిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఒక సంస్థ అంచ‌నా వేసిన ప్ర‌కారం.. ఈ రోజు రాత్రి మ్యాచ్‌ను ఏకంగా 100 కోట్ల మంది చూస్తార‌ని చెబుతున్నారు.

మ‌న దేశంలో అనేక న‌గ‌రాలు, ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల్లో ఇప్ప‌టికే ప‌లు థియేట‌ర్లు భార‌త్‌, పాకిస్థాన్ మ్యాచ్‌ను తెర‌ల‌పై ప్ర‌సారం చేయ‌నున్నాయి. అనేక కాల‌నీల్లో, అసోసియేష‌న్ కార్యాల‌యాల్లో కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ మ్యాచ్ తెగ హై ఓల్టేజ్‌గా సాగుతుంద‌ని చెప్ప‌వచ్చు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఐసీసీ టోర్నీల్లో భార‌త్‌దే పైచేయి క‌నుక.. ఈ మ్యాచ్‌లో కూడా అభిమానులు భార‌త్ గెల‌వాల‌ని బ‌లంగా కోరుకుంటున్నారు. మ‌రి టీమిండియా త‌న మొద‌టి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ను ఢీకొంటుంది క‌నుక ఎలా ఆడుతారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment