T20 World Cup 2021 : షార్జా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 17వ మ్యాచ్‌లో స్కాట్లండ్‌పై ఆఫ్గనిస్థాన్ ఘన విజయం సాధించింది. ఆఫ్గన్ ముందు పసికూన స్కాట్లండ్ తేలిపోయింది. ఆఫ్గనిస్థాన్ ఉంచిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక స్కాట్లండ్ కుప్పకూలింది. దీంతో స్కాట్లండ్‌పై ఆఫ్గనిస్థాన్ 130 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గనిస్థాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్లలో టాప్ 4 బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించారు. 34 బంతులు ఆడిన నజీబుల్లా జద్రాన్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేయగా.. రహమానుల్లా గుర్బాజ్ 37 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మన్ హజ్రతుల్లా జజై 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. స్కాట్లండ్ బౌలర్లలో సఫ్‌యాన్ షరీఫ్ 2 వికెట్లు తీయగా, జోష్ డేవీ, మార్క్ వాట్ చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన స్కాట్లండ్ 10.2 ఓవర్లలోనే కుప్పకూలింది. 60 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో ఎవరూ ఆకట్టుకోలేదు. ఓపెనర్ జార్జ్ మున్సే ఒక్కడే 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఇక ఆఫ్గన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహమాన్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ కూడా 4 వికెట్లు తీసి స్కాట్లండ్ పతనాన్ని శాసించాడు. మరో బౌలర్ నవీన్ ఉల్ హక్ కు 1 వికెట్ దక్కింది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…