Sri Devi Drama Company : బుల్లి తెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి ప్రతి రోజూ ఎన్నో కార్యక్రమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో పాల్గొనే కమెడియన్లు తమ అద్భుతమైన కామెడీ పంచ్ లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.
వచ్చే ఆదివారం కార్యక్రమంలో స్పెషల్ ఈవెంట్ ప్రసారం చేయనున్నారు. ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ వనభోజనాలు పేరుతో ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి బుల్లితెర సీరియల్ నటీనటులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బుల్లితెర నటీనటులు అందరూ కూడా తమదైన శైలిలో స్కిట్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ ఏకంగా చీరలు కట్టుకొని స్టేజ్ పైకి వచ్చి అందరినీ మరింత సందడి చేశారు. సీరియల్ ఆర్టిస్టులు హైపర్ ఆదిని సపోర్ట్ చేయగా ఆటో రాంప్రసాద్ ని జబర్దస్త్ టీం సపోర్ట్ చేశారు. ఇలా సీరియల్ నటీనటులు, జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…