Sri Devi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీ వనభోజనాలు.. రచ్చ చేస్తున్న సీరియల్ స్టార్స్..!

October 25, 2021 10:15 PM

Sri Devi Drama Company : బుల్లి తెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి ప్రతి రోజూ ఎన్నో కార్యక్రమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో పాల్గొనే కమెడియన్లు తమ అద్భుతమైన కామెడీ పంచ్ లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.

Sri Devi Drama Company vanabhojanalu special program promo viral

వచ్చే ఆదివారం కార్యక్రమంలో స్పెషల్ ఈవెంట్ ప్రసారం చేయనున్నారు. ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ వనభోజనాలు పేరుతో ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి బుల్లితెర సీరియల్ నటీనటులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బుల్లితెర నటీనటులు అందరూ కూడా తమదైన శైలిలో స్కిట్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ ఏకంగా చీరలు కట్టుకొని స్టేజ్ పైకి వచ్చి అందరినీ మరింత సందడి చేశారు. సీరియల్ ఆర్టిస్టులు హైపర్ ఆదిని సపోర్ట్ చేయగా ఆటో రాంప్రసాద్ ని జబర్దస్త్ టీం సపోర్ట్ చేశారు. ఇలా సీరియల్ నటీనటులు, జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయనున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment