Suman : టాలీవుడ్ లో హీరోగా చేసి ఆ తర్వాత సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సుమన్. అప్పట్లో చిరంజీవి లాంటి స్టార్ హీరోకు కూడా పోటీ ఇస్తూ వరుస హిట్స్ అందుకున్నారు. కొంతకాలానికి కెరీర్ పరంగా కాస్త డీలా పడిన ఆయన ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యమున్న రోల్స్ చేస్తున్నారు. సుమన్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటీవల కొంత మంది పాపులారిటీ కోసమో, సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసమో, వ్యూస్ పెరిగితే వచ్చే డబ్బు కోసమో.. సెలబ్రెటీలను బతికుండగానే చంపేస్తున్నారు.
గతంలో కొంత మంది తారలు ఈ విధమైన ఫేక్ డెత్ న్యూస్, యూట్యూబ్ థంబ్‌నైల్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించాడు సుమన్. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ ఇక లేరంటూ ఉత్తరాదికి చెందిన పలు యూట్యూబ్ ఛానల్స్ వార్తలు ప్రసారం చేశాయి. ఆ వార్తలు చూసిన సుమన్ అభిమానులు, సన్నిహితులు ఆందోళనకు గురయ్యారు. ఈ వార్తల్లో నిజమెంత ? అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.
చివరకు ఈ వార్తలు సుమన్ చెంతకు చేరడంతో తనపై ఇలాంటి వార్తలు ప్రసారం చేసిన ఆ యూట్యూబ్ ఛానల్ పై చట్టపరంగా కేసు వేస్తానన్నారు సుమన్. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. రెగ్యూలర్ గా షూటింగ్స్ చేసుకుంటున్నానని, అటువంటిది తనపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా వార్తలు ఎలా ప్రాసారం చేస్తారంటూ మండిపడ్డారు. ఆ ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తానన్నారు సుమన్. కాగా సుమన్ తన సినీ కెరీర్‌లో దాదాపుగా 150కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన ఐక్యూ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన పోలీసు అధికారిగా కనిపించనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…