Lakshmi Pranathi : టాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్ హీరోల సతీమణులు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ జోష్ తో యాక్టివ్‌గా ఉంటారు. అందులో ముఖ్యంగా చెప్పుకునేవారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత, అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి, రామ్ చరణ్ భార్య ఉపాసన ఉన్నారు. అంతేకాకుండా తమ భర్తలకు సంబంధించిన సినిమా కబుర్లతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు తమ అభిమానులతో పంచుకుంటూ నెట్టింట అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరో భార్య కూడా ఈ కోవలోకి వచ్చేసింది. ఎప్పటికప్పుడు లైమ్ టైమ్ లో సందడి చేస్తూ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరో భార్య అని ఆలోచిస్తున్నారా..? ఆమె ఇంకెవరో కాదు, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి.
పెళ్లయిన కొత్తలో లక్ష్మీప్రణతి అప్పుడప్పుడు ఏదో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ లలో కనిపించేది తప్పా.. ఎక్కడా ఆమె పేరు అంతగా వినిపించేది కాదు. ఇద్దరు పిల్లలకు పెళ్లి కావడంతో కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే లక్ష్మీప్రణతి ఫంక్షన్ లకు, మీడియాకు దూరంగా ఉంటోంది. ఇటీవలే ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి కలిసి లాన్‌లో కాఫీ తాగుతూ సరదాగా ముచ్చటించుకుంటున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోని సరదాగా ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.
ఇప్పుడు ఎలా చిక్కిందోగానీ లక్ష్మీప్రణతి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో లక్ష్మీ ప్రణతి సంప్రదాయమైన దుస్తులలో ఒంటి నిండా నగలతో చూడడానికి అచ్చం లక్ష్మీదేవిలా ఉంది. మరి ఇంత అందమైన లుక్ లో కనిపిస్తే మన నెటిజన్లు ఊరుకుంటారా.. వెంటనే లక్ష్మీప్రణతి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. దీనితో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…