Lakshmi Pranathi : ఎన్‌టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి అచ్చం ల‌క్ష్మీ దేవిలా ఉందే.. ఫొటో వైర‌ల్‌..!

August 31, 2022 4:59 PM

Lakshmi Pranathi : టాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్‌ హీరోల సతీమణులు సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఫుల్ జోష్ తో యాక్టివ్‌గా ఉంటారు. అందులో ముఖ్యంగా చెప్పుకునేవారిలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు భార్య నమ్రత, అల్లు అర్జున్‌ భార్య స్నేహరెడ్డి, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన ఉన్నారు. అంతేకాకుండా తమ భర్తలకు సంబంధించిన సినిమా కబుర్లతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు తమ అభిమానులతో పంచుకుంటూ నెట్టింట అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరో భార్య కూడా ఈ కోవలోకి వచ్చేసింది. ఎప్పటికప్పుడు లైమ్ టైమ్ లో సందడి చేస్తూ నెట్టింట్లో వైరల్ అవుతోంది.  ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరో భార్య అని ఆలోచిస్తున్నారా..? ఆమె ఇంకెవరో కాదు, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి.

పెళ్లయిన కొత్తలో లక్ష్మీప్రణతి అప్పుడప్పుడు ఏదో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ ల‌లో కనిపించేది తప్పా.. ఎక్కడా ఆమె పేరు అంతగా వినిపించేది కాదు. ఇద్దరు పిల్లలకు పెళ్లి కావడంతో కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే లక్ష్మీప్రణతి ఫంక్షన్ లకు, మీడియాకు దూరంగా ఉంటోంది. ఇటీవలే ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి కలిసి లాన్‌లో కాఫీ తాగుతూ సరదాగా ముచ్చటించుకుంటున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన‌ సంగతి తెలిసిందే. ఈ ఫోటోని సరదాగా ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.

Jr NTR wife Lakshmi Pranathi latest silk saree photo viral
Lakshmi Pranathi

ఇప్పుడు ఎలా చిక్కిందోగానీ లక్ష్మీప్రణతి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో లక్ష్మీ ప్రణతి సంప్రదాయమైన దుస్తులలో ఒంటి నిండా నగలతో చూడడానికి అచ్చం లక్ష్మీదేవిలా ఉంది. మరి ఇంత అందమైన లుక్ లో కనిపిస్తే మన నెటిజన్లు ఊరుకుంటారా.. వెంటనే లక్ష్మీప్రణతి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. దీనితో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now