Suman : సుమ‌న్ చ‌నిపోయాడ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సుమ‌న్‌..

August 31, 2022 4:31 PM

Suman : టాలీవుడ్ లో హీరోగా చేసి ఆ తర్వాత సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సుమన్. అప్పట్లో చిరంజీవి లాంటి స్టార్ హీరోకు కూడా పోటీ ఇస్తూ వరుస హిట్స్ అందుకున్నారు. కొంతకాలానికి కెరీర్ పరంగా కాస్త డీలా పడిన ఆయన ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యమున్న రోల్స్ చేస్తున్నారు. సుమన్‏కు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటీవల కొంత మంది పాపులారిటీ కోసమో, సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసమో, వ్యూస్ పెరిగితే వచ్చే డబ్బు కోసమో.. సెలబ్రెటీలను బతికుండగానే చంపేస్తున్నారు.

గతంలో కొంత మంది తారలు ఈ విధమైన ఫేక్ డెత్ న్యూస్, యూట్యూబ్ థంబ్‌నైల్స్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించాడు సుమన్. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ ఇక లేరంటూ ఉత్తరాదికి చెందిన పలు యూట్యూబ్ ఛానల్స్ వార్తలు ప్రసారం చేశాయి. ఆ వార్తలు చూసిన సుమన్ అభిమానులు, సన్నిహితులు ఆందోళనకు గురయ్యారు. ఈ వార్తల్లో నిజమెంత ? అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

Suman death news viral he responded very angry
Suman

చివరకు ఈ వార్త‌లు సుమ‌న్ చెంత‌కు చేర‌డంతో తనపై ఇలాంటి వార్తలు ప్రసారం చేసిన ఆ యూట్యూబ్ ఛానల్ పై చట్టపరంగా కేసు వేస్తానన్నారు సుమన్. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. రెగ్యూలర్ గా షూటింగ్స్ చేసుకుంటున్నానని, అటువంటిది తనపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా వార్తలు ఎలా ప్రాసారం చేస్తారంటూ మండిపడ్డారు. ఆ ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తానన్నారు సుమన్. కాగా సుమన్ తన సినీ కెరీర్‌లో దాదాపుగా 150కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన ఐక్యూ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన పోలీసు అధికారిగా కనిపించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now