Samantha : సమంత విడాకుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన..స్టైలిస్ట్‌ ప్రీతమ్..!

October 5, 2021 4:26 PM

Samantha : సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారని తెలియగానే మొట్టమొదటిసారిగా సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్ జుకల్కర్ సంచలన కామెంట్ చేశారు. సమంతతో సోదరభావం పెట్టుకున్న ప్రీతమ్ ఆమె విడాకుల విషయం తెలియగానే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చేసిన కొంత సమయానికి డిలీట్ చేశారు. అయితే అతను డిలీట్ చేసినప్పటికీ ఆ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Stylist Preetham made sensational comments about Samantha divorce

ఈ క్రమంలోనే ప్రీతమ్.. సమంత, నాగచైతన్య విడాకులు అవగానే ‘కంగ్రాట్స్ స్లట్.. హి ఈజ్ యువర్స్’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చేసిన కొంత సమయానికే డిలీట్ అయినప్పటికీ ఈ పదం మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రీతమ్ ఎవరిని ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ చేశారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సమంతతో చనువుగా ఉంటే ప్రీతమ్ కు తన విషయాలన్నీ తెలిసి ఉంటాయని ఈ క్రమంలోనే సమంతకు అన్యాయం చేసిన ఒక నీతిమాలిన స్త్రీ అంటూ తనని దూషించినట్లు తెలుస్తోంది. అతని మాటల ప్రకారం నాగ చైతన్య ఎవరితోనైనా ప్రేమలో పడ్డాడా..? ఆమె ప్రేమలో పడటం వల్ల సమంతను దూరం పెడుతూ తనకు విడాకులు ఇచ్చాడా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ విడాకుల విషయంలో సమంతకు మాత్రం అన్యాయం జరిగిందని కొందరు భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment