SS Rajamouli : అవునన్నా.. కాదన్నా.. ఇండస్ట్రీ పెద్ద ఆయనే.. రాజమౌళి సంచలన కామెంట్స్..!

March 20, 2022 3:35 PM

SS Rajamouli : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను చిక్‌బలాపూర్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు రావడమే కాకుండా కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

SS Rajamouli said Tollywood leader is Chiranjeevi
SS Rajamouli

ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి, మంత్రులకు అలాగే శివ రాజ్ కుమార్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నటుడు దివంగత పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు సహాయం చేసినందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.

గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల రేట్లు దారుణంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. సినీ ప్రముఖుల కోరిక మేరకు సినీ పరిశ్రమ సమస్యలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ సినిమా టికెట్ల ధరలను పెంచుతూ జీవో విడుదల చేశారు. ఈ జీవో విడుదల అయిన తర్వాత రాజమౌళి మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీఎ జగన్‌ తమ సినిమా గురించి చెప్పగానే ఆయన అర్థం చేసుకొని సినిమా టికెట్ల రేట్లను పెంచారని జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఇక సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు ఉండగా చిత్ర పరిశ్రమ కోసం పోరాడటానికి ఒకే ఒక వ్యక్తి ముందుకు వచ్చారని, ఆయనే మెగాస్టార్ చిరంజీవి.. అంటూ చిరంజీవిని ప్రశంసించారు. ఆయనని ఎందరో ఎన్నో మాటలు అన్నప్పటికీ మా గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఆయనే నిజమైన మెగాస్టార్. ఆయనను నేను ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్నాను.. అంటూ రాజమౌళి కామెంట్స్‌ చేశారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా.. చిరంజీవే ఇండస్ట్రీకి పెద్ద.. అని రాజమౌళి అన్నారు. దీంతో ఆయన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now