SS Rajamouli : ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. టాలీవుడ్‌కు పెద్ద ఆయ‌నేన‌ట‌..!

February 10, 2022 8:11 PM

SS Rajamouli : ఏపీలో గ‌త కొద్ది నెల‌లుగా నెల‌కొన్న సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యానికి గురువారంతో ఫుల్ స్టాప్ ప‌డింద‌నే చెప్ప‌వ‌చ్చు. మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, ప్ర‌భాస్‌, మ‌హేష్ బాబులు సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. అయితే జ‌గన్‌తో స‌మావేశం అనంత‌రం చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీలో టిక్కెట్ల ధ‌ర‌ల‌పై ప‌ది రోజుల్లో కొత్త జీవో వ‌స్తుంద‌ని, అంద‌రూ శుభ‌వార్త వింటార‌ని అన్నారు. దీంతో మ‌రికొద్ది రోజుల్లో ఈ స‌మస్య ప‌రిష్కారం కానుంది. ఈ క్ర‌మంలోనే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఈ వార్త‌తో ఊపిరి పీల్చుకున్నాయి.

SS Rajamouli  said chiranjeevi is main person for Tollywood
SS Rajamouli

ఇక జ‌గ‌న్‌తో స‌మావేశం అనంత‌రం ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మీడియాతో మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సినిమా ఇండస్ట్రీకి చిరంజీవినే పెద్ద అని తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలోనే రాజ‌మౌళి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం క‌లిగిస్తున్నాయి. సినీ ప‌రిశ్ర‌మ అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటుంద‌ని, అవే స‌మ‌స్య‌ల‌ను సీఎం జ‌గ‌న్‌కు వివ‌రించామ‌ని అన్నారు. ఈ విష‌యంలో చిరంజీవి కృషి ఎంతో ఉంద‌న్నారు. ఆయ‌న అంద‌రినీ స‌మ‌న్వ‌యం చేసి స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేలా చూశార‌ని, క‌నుక ఇండ‌స్ట్రీకి ఆయ‌నే పెద్ద అని అన్నారు.

సీఎం జ‌గ‌న్‌తో చిరంజీవికి సాన్నిహిత్యం ఉంద‌ని, అందుక‌నే చిరంజీవి ఇంత‌లా శ్ర‌మించి ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యేలా చేశార‌ని.. అందుకు చిరంజీవికి కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నామ‌ని.. రాజ‌మౌళి అన్నారు. అయితే చిరంజీవి జ‌గ‌న్‌ను క‌లుస్తున్నందుకు గుర్రుగా ఉన్న మోహ‌న్ బాబు వ‌ర్గీయులు ఇప్పుడు ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now