SS Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమాలతో చరిత్రలు సృష్టించడమే కాకుండా అందులోని హీరోలకు ప్రత్యేక గుర్తింపు లభించేలా చేస్తాడు. బాహుబలితో ప్రభాస్ క్రేజ్ పీక్స్‌లోకి వెళ్లగా, ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు పాన్ ఇండియా హీరోలుగా మారారు. అయితే రాజమౌళితో సినిమా అంటే ఎలాంటి ఢోకా ఉండదు కానీ ఆయనతో చేసిన తర్వాత వచ్చే మూవీ మాత్రం పక్కా ఫ్లాప్ అవ్వడం జరుగుతుంది. 2001లో ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం స్టూడెంట్ నంబర్ 1. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన సుబ్బు సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
జక్కన్నతో సింహాద్రి తీసి సక్సెస్ కొట్టిన తారక్, ఆ తర్వాత చేసిన ఆంధ్రావాలాతో బొక్కబోర్లా పడ్డాడు. జక్కన్నతో కలిసి యమదొంగ చేశాడు ఎన్టీఆర్. ఇదీ సూపర్ హిట్టే కానీ ఆ తర్వాత చేసిన కంత్రీ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ప్రభాస్‌తో బాహుబలి, బాహుబలి 2 చేసి పాన్ ఇండియా హిట్స్ ఇచ్చాడు రాజమౌళి. కానీ ఆ తర్వాత ప్రభాస్ చేసిన సాహో తీవ్ర నిరాశను మిగిల్చింది. 2009లో రామ్‌చరణ్‌తో మగధీర హిట్. కానీ ఆ మరుసటి ఏడాది రిలీజైన చరణ్ మూవీ ఆరెంజ్ తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఇక ఇటీవల రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తో ఆర్‌ఆర్‌ఆర్ తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు రాజమౌళి.
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా రాజమౌళి సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. ఆ ఊహను ఆచార్య తుడిచిపెట్టేస్తుందని భరోసా ఇచ్చారు చిరంజీవి. కానీ అది జరగలేదు. సినిమా డివైడ్ టాక్ రావడంతో రాజమౌళి సెంటిమెంట్ మళ్లీ ప్రూవ్ అయిందని అంటున్నారు. ఆచార్యలో చిరంజీవిని ఏం చేయనీయకుండా చేశాడు దర్శకుడు. అదే సమయంలో రామ్‌చరణ్ పాత్రని బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక రొమాన్స్ లేదు, కామెడీ లేదు. యాక్షన్ ఎపిసోడ్స్, కొంత మేర డాన్సులు తప్ప మెగాస్టార్ నుంచి ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసే అంశాలు ఇందులో కొరవడ్డాయి. ఈ క్రమంలోనే సినిమా నెగెటివ్ టాక్ ను మూటగట్టుకుంటోంది. దీంతో రాజమౌళి గండం మళ్లీ రిపీట్ అయిందని అంటున్నారు. ఇందులో చరణ్ లేకుండా ఉంటే సినిమా హిట్ అయ్యేది కాబోలు.. అని అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…