SS Rajamouli : రాజ‌మౌళి గండాన్ని బ్రేక్ చేయ‌లేక‌పోయిన ఆచార్య‌.. సెంటిమెంట్ రిపీట్..!

April 30, 2022 9:15 AM

SS Rajamouli : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌న సినిమాల‌తో చ‌రిత్ర‌లు సృష్టించ‌డ‌మే కాకుండా అందులోని హీరోల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించేలా చేస్తాడు. బాహుబలితో ప్ర‌భాస్ క్రేజ్ పీక్స్‌లోకి వెళ్ల‌గా, ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌లు పాన్ ఇండియా హీరోలుగా మారారు. అయితే రాజ‌మౌళితో సినిమా అంటే ఎలాంటి ఢోకా ఉండ‌దు కానీ ఆయ‌న‌తో చేసిన త‌ర్వాత వ‌చ్చే మూవీ మాత్రం ప‌క్కా ఫ్లాప్ అవ్వ‌డం జ‌రుగుతుంది. 2001లో ఎన్టీఆర్‌- రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం స్టూడెంట్ నంబర్‌ 1. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్‌ హీరోగా నటించిన సుబ్బు సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది.

SS Rajamouli fear for acharya movie continued
SS Rajamouli

జక్కన్నతో సింహాద్రి తీసి సక్సెస్‌ కొట్టిన తారక్, ఆ తర్వాత చేసిన ఆంధ్రావాలాతో బొక్క‌బోర్లా ప‌డ్డాడు.  జక్కన్నతో కలిసి యమదొంగ చేశాడు ఎన్టీఆర్‌. ఇదీ సూపర్‌ హిట్టే కానీ ఆ తర్వాత చేసిన కంత్రీ అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ప్రభాస్‌తో బాహుబలి, బాహుబలి 2 చేసి పాన్‌ ఇండియా హిట్స్‌ ఇచ్చాడు రాజమౌళి. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో తీవ్ర నిరాశను మిగిల్చింది. 2009లో రామ్‌చరణ్‌తో మగధీర హిట్. కానీ ఆ మరుసటి ఏడాది రిలీజైన చరణ్‌ మూవీ ఆరెంజ్‌ తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఇక‌ ఇటీవల రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌తో ఆర్‌ఆర్‌ఆర్‌ తీసి ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు రాజమౌళి.

ఈ సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం ఆచార్య‌. ఈ సినిమా రాజ‌మౌళి సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఆ ఊహను ఆచార్య తుడిచిపెట్టేస్తుందని భరోసా ఇచ్చారు చిరంజీవి. కానీ అది జ‌ర‌గ‌లేదు. సినిమా డివైడ్ టాక్ రావ‌డంతో రాజ‌మౌళి సెంటిమెంట్ మ‌ళ్లీ ప్రూవ్ అయింద‌ని అంటున్నారు.  ఆచార్యలో చిరంజీవిని ఏం చేయనీయకుండా చేశాడు దర్శకుడు. అదే సమయంలో రామ్‌చరణ్‌ పాత్రని బలవంతంగా ఇరికించిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఒక రొమాన్స్ లేదు, కామెడీ లేదు. యాక్షన్‌ ఎపిసోడ్స్, కొంత మేర డాన్సులు తప్ప మెగాస్టార్‌ నుంచి ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసే అంశాలు ఇందులో కొరవడ్డాయి. ఈ క్ర‌మంలోనే సినిమా నెగెటివ్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంటోంది. దీంతో రాజ‌మౌళి గండం మ‌ళ్లీ రిపీట్ అయిందని అంటున్నారు. ఇందులో చ‌ర‌ణ్ లేకుండా ఉంటే సినిమా హిట్ అయ్యేది కాబోలు.. అని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now