శనివారం, జూన్ 13, 2026
వార్తలు

Srinu Vaitla : పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో సినిమాలు చేయ‌ని శ్రీను వైట్ల.. ఎందుకో తెలుసా ?

Srinu Vaitla : తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్, యాక్షన్, కమర్షియల్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఒకరు. ఈయన సినిమాలకు భారీగా బ్రేక్ ఇచ్చారు. అలాగే టాలీవుడ్ లో చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో…

Srinu Vaitla : పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో సినిమాలు చేయ‌ని శ్రీను వైట్ల.. ఎందుకో తెలుసా ?

Srinu Vaitla : తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్, యాక్షన్, కమర్షియల్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఒకరు. ఈయన సినిమాలకు భారీగా బ్రేక్ ఇచ్చారు. అలాగే టాలీవుడ్ లో చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో వర్క్ చేశారు. కానీ ఇప్పటివరకు శ్రీను వైట్ల డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో సినిమాలు చేయకపోవడం గమనార్హం. లేటెస్ట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై డైరెక్టర్ శ్రీను వైట్ల స్పందించారు. శ్రీనువైట్ల మాట్లాడుతూ.. నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి ఉంటే బాగుండేదని, తనకు కోరిక ఉందని.. అలాగే తన కథలు పవన్ కళ్యాణ్ కు సింక్ అవుతాయని అభిప్రాయపడ్డారు.

Srinu Vaitla told why he did not do movies with pawan kalyan and balakrishna

అలాగే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి ఆఫర్ కూడా వచ్చిందని, ఆ టైమ్ లో పవన్ కళ్యాణ్ కు సూట్ అయ్యే కథలు దొరకలేదని, ఇంతకు ముందు రెండు సార్లు కలిశామని అన్నారు. నెక్ట్స్ బాలకృష్ణతో కూడా సినిమా చేయాలని అనుకున్నాను గానీ అది కుదరలేదని నిరాశ వ్యక్తం చేశారు. బాలకృష్ణను డిఫరెంట్ యాంగిల్ లో చూపించాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ ఏది వర్కవుట్ అవ్వలేదని అన్నారు. బాలకృష్ణను డైరెక్టర్లందరూ ఒకేలా చూపిస్తున్నారని, ఆయన పాపులర్ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తూ.. తన మార్క్ ని యాడ్ చేసి ఎంటర్ టైనింగ్ యాంగిల్ లో ప్రజంట్ చేయాలనుకున్నట్లు తెలిపారు.

స్క్రిప్ట్ కూడా ఆ టైమ్ లో రెడీగా ఉందని, కానీ ఆయనకు సబ్జెక్ట్ చెప్పే టైమ్ కుదరలేదని అన్నారు. శ్రీనువైట్ల, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన ఢీ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా మంచు విష్ణు హీరోగా ఢీ అంటే ఢీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతోపాటుగా మరో మూడు స్క్రిప్టులు చేతిలో ఉన్నాయని, ఈ సినిమాల తర్వాత మహేష్ బాబును కలుస్తానని శ్రీనువైట్ల తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి