Srikanth : క‌రోనా బారిన ప‌డిన‌ట్లు వెల్ల‌డించిన శ్రీ‌కాంత్‌..!

January 26, 2022 2:43 PM

Srikanth : ఈ మ‌ధ్య కాలంలో సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది క‌రోనా బారిన ప‌డ్డారు. మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌, మంచు ల‌క్ష్మీ.. తాజాగా చిరంజీవి కోవిడ్ బారిన ప‌డ్డారు. ఇక హీరో శ్రీ‌కాంత్ కూడా క‌రోనా బారిన ప‌డిన‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

Srikanth told that he got covid positive

త‌న‌కు ద‌గ్గు, జ‌లుబు వంటి స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని.. టెస్ట్ చేయించుకుంటే కోవిడ్ పాజిటివ్ అని తేలింద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌లి కాలంలో త‌న‌ను క‌లిసిన వారంద‌రూ కోవిడ్ నిర్దార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని శ్రీ‌కాంత్ కోరారు.

తాను అన్ని జాగ్ర‌త్త‌ల‌ను తీసుకున్నాన‌ని.. అయిన‌ప్ప‌టికీ క‌రోనా సోకింద‌ని శ్రీ‌కాంత్ తెలిపారు. కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఏ మాత్రం అశ్ర‌ద్ధ చేయొద్ద‌ని.. వెంట‌నే ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని.. పాజిటివ్ అని తేలితే చికిత్స తీసుకోవాల‌ని అన్నారు. కాగా శ్రీ‌కాంత్ గ‌త వారం కింద‌ట తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన అఖండ మూవీ భారీ హిట్ అయింది. ఇందులో ఆయ‌న తొలిసారిగా విల‌న్ పాత్ర పోషించి మెప్పించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment