Sreeleela : యంగ్ భామలకు మన దర్శక నిర్మాతలు పట్టం కడుతుంటారు. ఒక సినిమాతోనే క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్‌కి వరుస ఆఫర్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌ని షేక్ చేసిన కృతి శెట్టికి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇక తాజాగా పెళ్లి సందD చిత్ర హీరోయిన్ శ్రీలీలకి కూడా అవకాశాలు క్యూ కట్టాయి. ఒక్క హిట్టు.. ఆమెని స్టార్ హీరోయిన్ల పక్కన నిలబెట్టింది.
పెళ్లి సందడి చిత్రంలో శ్రీలీల నటనకు మంచి మార్కులు పడ్డాయి. బొద్దుగా, చూడగానే ఆకట్టుకునేలా ఉన్న శ్రీలీల డ్యాన్స్‌ల్లోనూ ఇరగ్గొడుతోంది. దీంతో నిర్మాతలు ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ ఇస్తున్నారు. రవితేజ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఫిక్సయ్యింది. శర్వా, నితిన్, నిఖిల్, సాయిధరమ్ తేజ్.. ఇలాంటి యంగ్ బ్యాచ్ పక్కన శ్రీలీల అయితే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీల ఐదారు సినిమాలకు సంబంధించి చర్చలు జరుపుతోందట. అవి కానీ ఓకే అయి వాటిలో చేసి అవి హిట్ అయితే ఈ అమ్మడికి స్టార్ డమ్ రావడం పక్కా అనే చెప్పాలి. తెలుగులో తన మొదటి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో చేసే అవకాశం కొట్టేసిన శ్రీలీల ఇప్పటికే చాలామంది అబ్బాయిల క్రష్ లిస్ట్‌లో చేరిపోయింది. మరోవైపు ఈ అమ్మడికి వివాదాలు కూడా మొదలయ్యాయి. శ్రీలీల ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు కూతురని గతకొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ కాగా, దాన్ని ఆయన ఖండించిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…