Sreeleela : పెళ్లి సంద‌D హీరోయిన్‌కి ఒకే సారి ఇన్ని సినిమాలు వ‌చ్చిప‌డ్డాయా..!

October 24, 2021 6:38 PM

Sreeleela : యంగ్ భామ‌ల‌కు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు ప‌ట్టం క‌డుతుంటారు. ఒక సినిమాతోనే క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్‌కి వ‌రుస ఆఫ‌ర్స్ ఇస్తున్నారు. ఇప్ప‌టికే ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌ని షేక్ చేసిన కృతి శెట్టికి ఆఫ‌ర్స్ క్యూ క‌ట్టాయి. ఇక తాజాగా పెళ్లి సంద‌D చిత్ర హీరోయిన్ శ్రీలీల‌కి కూడా అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. ఒక్క హిట్టు.. ఆమెని స్టార్ హీరోయిన్ల పక్కన నిలబెట్టింది.

Sreeleela getting many more offers from producers and directors

పెళ్లి సంద‌డి చిత్రంలో శ్రీలీల న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. బొద్దుగా, చూడ‌గానే ఆక‌ట్టుకునేలా ఉన్న శ్రీలీల డ్యాన్స్‌ల్లోనూ ఇర‌గ్గొడుతోంది. దీంతో నిర్మాత‌లు ఈ అమ్మ‌డికి వ‌రుస ఆఫ‌ర్స్ ఇస్తున్నారు. ర‌వితేజ సినిమాలో శ్రీ‌లీల హీరోయిన్ గా ఫిక్స‌య్యింది. శ‌ర్వా, నితిన్‌, నిఖిల్, సాయిధ‌ర‌మ్ తేజ్‌.. ఇలాంటి యంగ్ బ్యాచ్ ప‌క్క‌న శ్రీ‌లీల అయితే బాగుంటుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీల ఐదారు సినిమాలకు సంబంధించి చర్చలు జరుపుతోందట. అవి కానీ ఓకే అయి వాటిలో చేసి అవి హిట్ అయితే ఈ అమ్మడికి స్టార్ డమ్ రావడం పక్కా అనే చెప్పాలి. తెలుగులో తన మొదటి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో చేసే అవకాశం కొట్టేసిన శ్రీలీల ఇప్పటికే చాలామంది అబ్బాయిల క్రష్ లిస్ట్‌లో చేరిపోయింది. మ‌రోవైపు ఈ అమ్మ‌డికి వివాదాలు కూడా మొద‌ల‌య్యాయి. శ్రీలీల ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు కూతురని గతకొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ కాగా, దాన్ని ఆయ‌న ఖండించిన విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now