T20 World Cup 2021 : షార్జా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 15వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని శ్రీలంక సునాయాసంగానే ఛేదించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌పై లంక జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో మహమ్మద్ నయీమ్, ముష్‌ఫికుర్ రహీంలు అద్భుతంగా రాణించారు. 52 బంతుల్లో 6 ఫోర్లతో 62 పరుగులు చేసి నయీం ఫెర్నాండో బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అలాగే 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో రహీం 57 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో చమిక కరుణరత్నె, బినురా ఫెర్నాండో, లాహిరు కుమారలకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్లను కోల్పోయి 172 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్లలో చరిత్ అసలంక అద్భుతంగా రాణించాడు. 49 బంతులు ఆడిన అసలంక 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లంకకు విజయాన్ని అందించాడు. అలాగే మరో బ్యాట్స్‌మన్ భానుక రాజపక్స 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. బంగ్లా బౌలర్లలో నసుమ్ అహ్మద్, షకిబ్ అల్ హసన్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. మహమ్మద్ సయిఫుద్దీన్ 1 వికెట్ తీశాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…