T20 World Cup 2021 : బంగ్లాదేశ్‌పై శ్రీ‌లంక అద్భుత‌మైన విజ‌యం..!

October 24, 2021 7:29 PM

T20 World Cup 2021 : షార్జా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 15వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై శ్రీ‌లంక విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని శ్రీ‌లంక సునాయాసంగానే ఛేదించింది. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్‌పై లంక జ‌ట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

T20 World Cup 2021 srilanka won by 5 wickets against bangladesh in 15th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీ‌లంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్‌మెన్ల‌లో మ‌హమ్మ‌ద్ న‌యీమ్‌, ముష్‌ఫికుర్ ర‌హీంలు అద్భుతంగా రాణించారు. 52 బంతుల్లో 6 ఫోర్ల‌తో 62 ప‌రుగులు చేసి న‌యీం ఫెర్నాండో బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అలాగే 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో ర‌హీం 57 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. శ్రీ‌లంక బౌల‌ర్ల‌లో చ‌మిక క‌రుణ‌ర‌త్నె, బినురా ఫెర్నాండో, లాహిరు కుమార‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన శ్రీ‌లంక 18.5 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్ల‌ను కోల్పోయి 172 ప‌రుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్ల‌లో చ‌రిత్ అస‌లంక అద్భుతంగా రాణించాడు. 49 బంతులు ఆడిన అస‌లంక 5 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో 80 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లంక‌కు విజ‌యాన్ని అందించాడు. అలాగే మ‌రో బ్యాట్స్‌మ‌న్ భానుక రాజ‌ప‌క్స 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 53 ప‌రుగులు చేసి ఆక‌ట్టుకున్నాడు. బంగ్లా బౌల‌ర్ల‌లో న‌సుమ్ అహ్మ‌ద్‌, ష‌కిబ్ అల్ హ‌స‌న్‌ల‌కు చెరో 2 వికెట్లు ద‌క్కాయి. మ‌హ‌మ్మ‌ద్ స‌యిఫుద్దీన్ 1 వికెట్ తీశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now