Sirivennela : ఇన్నాళ్లూ అద్భుతమైన పదాలతో వెన్నెల ప్రసరింపజేసిన సిరివెన్నెల చీకట్లను మిగిల్చారు. సీతారామశాస్త్రి మరణాన్ని తెలుగు చిత్రసీమ తట్టుకోలేకపోతోంది. ఆ పాటసారిని, ఆయన పాటను ప్రాణంగా ప్రేమించిన వారందరి హృదయాలు.. అంతులేని వేదనతో సుడిగుండాలు అయ్యాయి. మాటలకందని విషాదం అందరిలోనూ ఉంది. అయితే సిరివెన్నెల చికిత్స నిమిత్తం కిమ్స్ హాస్పిటల్‌లో అయిన ఖర్చు మొత్తం ఏపీ ప్రభుత్వం భరించి, తమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సిరివెన్నెల కుటుంబ సభ్యులు ఓ లేఖను విడుదల చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి సిరివెన్నెల కుటుంబం మనస్పూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తుంది. నవంబర్ 30 ఉదయం 10గం.లకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి శాస్త్రి గారి ఆరోగ్య పరిస్థితులపై ఎంక్వయిరీ చేస్తూ ఫోన్ కాల్ వచ్చింది. ఆసుపత్రి ఖర్చులన్ని భరించమని జగన్ గారు ఆదేశించినట్టుగా తెలియజేశారు. సిరివెన్నెల 30 సాయంత్రం 4.07 ని.లకు స్వర్గస్తులైనారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వర్యులు తమ సంతాపాన్ని తెలియజేశారు.
శాస్త్రిగారి అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రివర్యులు హాజరై ఆసుపత్రి ఖర్చులను భరిస్తూ మేము కట్టిన అడ్వాన్స్‌కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలియజేశారు. సిరివెన్నెల గారి పట్ల ఇంతటి ప్రేమానురాగాలు చూపించి మా కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్ మోహన్ రెడ్డి గారికి మా కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ధన్యవాదాలు సర్.. అంటూ సిరివెన్నెల కొడుకు లేఖలో తెలిపారు.
కాగా, కాసేపటి క్రితం సిరివెన్నెల అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. సిరివెన్నెల చితికి ఆయన పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వర శర్మ నిప్పంటించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…