Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా ఉన్న సమంత ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక వైపు గ్లామర్ షో, మరో వైపు వరుస సినిమాలు చేస్తూ రచ్చ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించింది సమంత. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ పాటలో సమంతకు సంబంధించిన ఓ లుక్ ను రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. ఈ పిక్‌కి లెట్స్ రాక్ అని కామెంట్ పెట్టింది సమంత.
ఫ‍్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌కు పరిచయమైన సమంత ప్రస్తుతం ముంబై బాట పట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌కు చెందిన అగ్ర నిర‍్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సమంతతో చర‍్చలు జరుపుతున్నట్లు సమాచారం . ఒకేసారి మూడు సినిమాలకు ఒప్పందం చేసుకునేందుకు సామ్‌కు ప్రపోజల్ పెట్టిందట ఆ నిర్మాణ సంస్థ. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారట.
నిర్మాణ సంస్థ డిమాండ్‌కు సామ్ సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం. కాగా, సమంత ఇప్పటికే తెలుగులో శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు రెండు సౌత్ చిత్రాలతో బిజీగా ఉంది. వీటికి సంబంధించి కొద్ది రోజుల క్రితం అఫిషియల్ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…