Samantha : స‌మంత అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా.. మరో మూడు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌..

December 1, 2021 6:27 PM

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా ఉన్న స‌మంత ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఒక వైపు గ్లామ‌ర్ షో, మ‌రో వైపు వ‌రుస సినిమాలు చేస్తూ ర‌చ్చ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించింది స‌మంత. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ పాటలో సమంతకు సంబంధించిన ఓ లుక్ ను రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. ఈ పిక్‌కి లెట్స్ రాక్ అని కామెంట్ పెట్టింది స‌మంత‌.

Samantha : స‌మంత అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా.. మరో మూడు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌..

ఫ‍్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌కు పరిచయమైన సమంత ప్రస్తుతం ముంబై బాట పట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌కు చెందిన అగ్ర నిర‍్మాణ సంస్థ యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ సమంతతో చర‍్చలు జరుపుతున్నట్లు సమాచారం . ఒకేసారి మూడు సినిమాలకు ఒప్పందం చేసుకునేందుకు సామ్‌కు ప్రపోజల్ పెట్టింద‌ట‌ ఆ నిర్మాణ సంస్థ. ఇందుకోసం భారీగా రెమ్యున‌రేష‌న్ ఇస్తామ‌ని ఆఫ‌ర్ కూడా ఇచ్చార‌ట‌.

నిర్మాణ సంస్థ డిమాండ్‌కు సామ్ సానుకూలంగానే స్పందించినట్టు స‌మాచారం. కాగా, స‌మంత ఇప్పటికే తెలుగులో శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ‌రోవైపు రెండు సౌత్ చిత్రాల‌తో బిజీగా ఉంది. వీటికి సంబంధించి కొద్ది రోజుల క్రితం అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now