Venu Swamy : ప్రముఖ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కొన్నాళ్లుగా సినీ, రాజకీయ ప్రముఖులకి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ వార్తలలోకి ఎక్కుతున్నారు. నాగచైతన్య, సమంత విడిపోతారంటూ మూడేళ్ళ క్రితం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రీసెంట్‌గా కూడా.. నాకు అక్కినేని ఫ్యామిలీ అంటే ఎలాంటి కోపం లేదు.. అఖిల్ ఎంగేజ్ మెంట్ అయినప్పుడు అది క్యాన్సిల్ అవుతుందని చెప్పాను.. అలాగే జరిగింది. నాగచైతన్య, సమంతలకు మ్యారేజ్ అయిన తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయని అన్నాను. అలాగే జరిగింది.. అని ఆయన తెలిపారు. అవన్నీ అచ్చం ఆయన చెప్పినట్టుగానే జరగడం విశేషం.
తాజాగా జగన్ గురించి మాట్లాడుతూ.. జగన్ గారి జాతకం ప్రకారం ఆయన్ని టార్గెట్ చేయాలి అనుకుంటే 2022 ఏప్రిల్ 25లోపు టార్గెట్ చేయాలి.. ఎందుకు అంటే ఆయనకు అష్టమశని నడుస్తోంది. అది దాటింది అంటే ఎవరూ ఏమీ చేయలేరు. 2019లో జగన్ గారికి జాతకపరంగా స్టార్ట్ అయిన ఫేజ్.. 2022 ఏప్రిల్ 1వ తేదీకి క్లోజ్ అవుతుంది. 2024లో కూడా జగనే సీఎం. ఎలాగంటే ఆయనకు బుధ మహర్ధశ స్టార్ట్ అయ్యింది అని అన్నారు.
ఇక టీడీపీ, జనసేన పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే.. దానికి జోతిష్యం అవసరం లేదు.. సామన్య ప్రజలు కూడా వాళ్ల పరిస్థితి ఏంటో చెప్పేస్తారు. నేను ఇది చెప్తే వాళ్లేదో చేస్తారనే భయం నాకు లేదు.. నేను చనిపోడానికి కూడా రెడీ. పవన్ కళ్యాణ్ ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు.. ఆయన జాతకమే అంత. ఓవైపు సినిమాలు అంటాడు.. మరోవైపు రాజకీయాలు అంటాడు. ఎక్కడా ఒకదానిపై ఉండరు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండలేరని నేను చెప్పడం కాదు.. ఆయన జాతకమే చెప్తుంది. 2024 నాటికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండరు. ఆయనే లేనప్పుడు పార్టీ ఎక్కడ ఉంటుంది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు వేణుస్వామి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…