Venu Swamy : 2024 నాటికి ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ఉండ‌డు.. జ‌న‌సేన ఉండ‌దు.. ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

December 1, 2021 5:08 PM

Venu Swamy : ప్రముఖ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కొన్నాళ్లుగా సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డిస్తూ వార్త‌ల‌లోకి ఎక్కుతున్నారు. నాగచైతన్య, సమంత విడిపోతారంటూ మూడేళ్ళ క్రితం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రీసెంట్‌గా కూడా.. నాకు అక్కినేని ఫ్యామిలీ అంటే ఎలాంటి కోపం లేదు.. అఖిల్ ఎంగేజ్ మెంట్ అయినప్పుడు అది క్యాన్సిల్ అవుతుందని చెప్పాను.. అలాగే జరిగింది. నాగచైతన్య, సమంతలకు మ్యారేజ్ అయిన తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయని అన్నాను. అలాగే జ‌రిగింది.. అని ఆయ‌న తెలిపారు. అవ‌న్నీ అచ్చం ఆయ‌న చెప్పిన‌ట్టుగానే జ‌ర‌గ‌డం విశేషం.

Venu Swamy : 2024 నాటికి ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ఉండ‌డు.. జ‌న‌సేన ఉండ‌దు.. ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

తాజాగా జ‌గ‌న్ గురించి మాట్లాడుతూ.. జగన్ గారి జాతకం ప్రకారం ఆయన్ని టార్గెట్ చేయాలి అనుకుంటే 2022 ఏప్రిల్ 25లోపు టార్గెట్ చేయాలి.. ఎందుకు అంటే ఆయనకు అష్టమశని నడుస్తోంది. అది దాటింది అంటే ఎవరూ ఏమీ చేయలేరు. 2019లో జగన్ గారికి జాతకపరంగా స్టార్ట్ అయిన ఫేజ్.. 2022 ఏప్రిల్ 1వ తేదీకి క్లోజ్ అవుతుంది. 2024లో కూడా జగనే సీఎం. ఎలాగంటే ఆయనకు బుధ మహర్ధశ స్టార్ట్ అయ్యింది అని అన్నారు.

ఇక టీడీపీ, జనసేన పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే.. దానికి జోతిష్యం అవసరం లేదు.. సామన్య ప్రజలు కూడా వాళ్ల పరిస్థితి ఏంటో చెప్పేస్తారు. నేను ఇది చెప్తే వాళ్లేదో చేస్తారనే భయం నాకు లేదు.. నేను చనిపోడానికి కూడా రెడీ. పవన్ కళ్యాణ్ ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు.. ఆయన జాతకమే అంత. ఓవైపు సినిమాలు అంటాడు.. మరోవైపు రాజకీయాలు అంటాడు. ఎక్కడా ఒకదానిపై ఉండరు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండలేరని నేను చెప్పడం కాదు.. ఆయన జాతకమే చెప్తుంది. 2024 నాటికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండరు. ఆయనే లేనప్పుడు పార్టీ ఎక్కడ ఉంటుంది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు వేణుస్వామి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now