Singer Chinmayi : లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఘంటసాల పాడినట్టుగా సమాజంలో మహిళల గురించి ఎక్కడ ఏ డిస్కషన్ జరుగుతున్నా సరే అక్కడ వెంటనే ప్రత్యక్షమవుతుంది సింగర్ చిన్మయి శ్రీపాద. మీటూ కేవలం హీరోయిన్స్ కి మాత్రమే కాదు సింగర్స్ లో కూడా ఉంటుందని ప్రముఖ సీనియర్ రైటర్ వైరముత్తుతో ఆమె చేసిన ఫైట్ అందరికీ తెలిసిందే. అయితే అది ఇంకా అలాగే కొనసాగుతుందనుకోండి. అయితే సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న విషయాల గురించి చిన్మయి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రశ్నిస్తుంటుంది.
ఇక లేటెస్ట్ గా హీరోల నగ్న ఫోటో షూట్ విషయమై మరోసారి ఆమె కామెంట్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ ఎంత పెద్ద హాట్ టాపిక్ అయ్యిందో తెలిసిందే. రణ్ వీర్ సింగ్ తర్వాత విష్ణు విశాల్ కూడా ఇలాంటి ఫోటోనే ఒకటి పెట్టి షాక్ ఇచ్చాడు. ఇక సింగర్ గీతా మాధురి భర్త నందు కూడా ఇలాంటి ఫోటోతోనే సర్ ప్రైజ్ చేశాడు. కొందరు హీరోయిన్స్ సైతం ఈ ఫోటో షూట్స్ ని మెచ్చుకుంటుండగా కొందరు మహిళలు మాత్రం తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మంచు లక్ష్మి స్పందించి ఇది నిజం కాలేదు.. కాకూడదు.. మీరు సీరియస్ గానే అంటున్నారా.. అని ట్వీట్ చేసింది.
ఇక లేటెస్ట్ గా ఈ విషయంపై స్పందించింది చిన్మయి శ్రీపాద. ఈ కేసు వేసిన మహిళలకు అసలు బుద్ధి ఉందా..? పనీ పాట లేదా..? ఇలాంటి వేస్ట్ కేసులు వేసి న్యాయస్థానం టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు. దానికి బదులు రేప్ చేసిన ప్రజా ప్రతినిధులకు ఎలా పొలిటికల్ టికెట్ లు ఇస్తున్నాయని కేసులు వేయొచ్చు కదా..? మహిళలను వేధించే ఎంపీలు, ఆడవాళ్ల మధ్య డ్యాన్స్ వేసే సీఎం ల మీద కేసులు చేయొచ్చు కదా..? కేవలం ఇదంతా అటెన్షన్ కోసమే అని.. వారి రక్షణ కోసం ఇది చేయలేదని చిన్మయి కామెంట్ చేసింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంలో కొందరు ఆమెను ప్రశంసిస్తుండగా.. కొందరు అనవసర విషయాల్లో వేలు పెట్టడం ఎందుకని చిన్మయికి కౌంటర్ వేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…