తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఇండియా వ్యాప్తంగా ఢీ డాన్స్ షో కు ప్రత్యేక స్థానం ఉంది. ఒక డాన్స్ షో ఇన్ని సీజన్ లుగా కొనసాగడం ఒక రికార్డు అయితే.. ఇండియాలో ఇప్పటి వరకు ఏ డాన్స్ షో కు దక్కని రేటింగ్ లను రికార్డులను ఢీ డాన్స్ షో దక్కించుకుంటోంది. బుల్లితెరపై ప్రసారమవుతూ దూసుకుపోతున్న ఈ కార్యక్రమానికి ఎంతోమంది న్యాయ నిర్ణయితలుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న వారిలో హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ ఒకరు.
నాయికా.. ప్రతి నాయికా.. పాత్ర ఏంటి అనేది కాదు.. సినిమాలో ఆ పాత్ర ప్రాధాన్యమెంత అనేదే చూస్తుంది శ్రద్ధాదాస్. అందుకే గ్లామర్ రోల్స్‌కే పరిమితం కాకుండా నటిగా నిలబడింది. ఇన్నేళ్లయినా ఇంకా లైమ్ లైట్ లో ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఢీ డాన్స్ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి ఒక హీరోయిన్ న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తుండడంతో ఆమె రెమ్యూనరేషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు శ్రద్ధాదాస్ ఒక్కో ఎపిసోడ్ కు ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా కథనాల ప్రకారం శ్రద్ధాదాస్ ఒక్కో ఎపిసోడ్ కు సుమారుగా రూ.3.50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ షోకి సంబంధించి రెండు ఎపిసోడ్లకు ఒక రోజే షూటింగ్ జరుగుతుందని ఇలా ఆమె రెండు ఎపిసోడ్లకు రూ.7 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. వెండితెరపై ఈమెకు అవకాశాలు లేకపోయినా బుల్లితెరపై ఇలా పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తుందని, ఇలా బుల్లితెర అభిమానులను కూడా సంపాదించుకుంటోందని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా శ్రద్ధాదాస్ ఫ్యాన్స్ కి మాత్రం పండగే అని చెప్పవచ్చు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…