వామ్మో.. ఢీ డాన్స్ షోలో ఒక్క ఎపిసోడ్ కి శ్రద్ధాదాస్ రెమ్యున‌రేష‌న్ అంత‌నా..?

August 19, 2022 2:15 PM

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఇండియా వ్యాప్తంగా ఢీ డాన్స్ షో కు ప్రత్యేక స్థానం ఉంది. ఒక డాన్స్ షో ఇన్ని సీజన్‌ లుగా కొనసాగడం ఒక రికార్డు అయితే.. ఇండియాలో ఇప్పటి వరకు ఏ డాన్స్ షో కు దక్కని రేటింగ్‌ లను రికార్డులను ఢీ డాన్స్ షో దక్కించుకుంటోంది. బుల్లితెరపై ప్రసారమవుతూ దూసుకుపోతున్న ఈ కార్యక్రమానికి ఎంతోమంది న్యాయ నిర్ణయితలుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న వారిలో హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ ఒకరు.

నాయికా.. ప్రతి నాయికా.. పాత్ర ఏంటి అనేది కాదు.. సినిమాలో ఆ పాత్ర ప్రాధాన్యమెంత అనేదే చూస్తుంది శ్రద్ధాదాస్‌. అందుకే గ్లామర్‌ రోల్స్‌కే పరిమితం కాకుండా నటిగా నిలబడింది. ఇన్నేళ్లయినా ఇంకా లైమ్‌ లైట్‌ లో ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఢీ డాన్స్ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

shraddha das remuneration for dhee dance show one episode

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి ఒక హీరోయిన్ న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తుండడంతో ఆమె రెమ్యూనరేషన్  ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు శ్రద్ధాదాస్ ఒక్కో ఎపిసోడ్ కు ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంద‌నే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా కథనాల ప్రకారం శ్రద్ధాదాస్ ఒక్కో ఎపిసోడ్ కు సుమారుగా రూ.3.50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ షోకి సంబంధించి రెండు ఎపిసోడ్లకు ఒక రోజే షూటింగ్ జరుగుతుందని ఇలా ఆమె రెండు ఎపిసోడ్లకు రూ.7 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. వెండితెరపై ఈమెకు అవకాశాలు లేకపోయినా బుల్లితెరపై ఇలా పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తుంద‌ని, ఇలా బుల్లితెర అభిమానులను కూడా సంపాదించుకుంటోంద‌ని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా శ్రద్ధాదాస్ ఫ్యాన్స్ కి మాత్రం పండగే అని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment