Sherlyn Chopra : పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకి తిప్పలు తప్పడం లేదు. తాజాగా ఆయనకు మరిన్ని కొత్త చిక్కులు రానున్నట్లు తెలుస్తోంది. మోడల్ షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జుహు పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు ఆమె రాజ్‌కుంద్రాపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల అశ్లీల చిత్రాల కేసులో చిక్కుకున్నశిల్పా శెట్టి భర్త, బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాపై హీరోయిన్, మోడల్ షెర్లిన్ చోప్రా మొదటి నుండి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తనని శిల్పా భర్త రాజ్‌కుంద్రా మోసం చేశాడని, మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తాజాగా పోలీసులకు తెలిపింది. అంతేగాక లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని షెర్లిన్ పోలీసులను కోరినట్లు మీడియాతో పేర్కొంది.
రాజ్ కుంద్రా తనను లైంగిక వేధింపులకు కూడా గురి చేశాడని, తమకు వ్యతిరేకంగా ఏదైనా ప్రకటన చేస్తే పరువు నష్టం దావాతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కుంద్రా, శెట్టి తనను బెదిరించారని ఈ ఫిర్యాదులో తెలిపింది. అంతేకాక రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్ తో సంబంధం ఉందని, వారి ద్వారా కూడా తనను బెదిరించారని చెప్పింది.
రాజ్ కుంద్రాపై షెర్లిన్ చోప్రా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తరువాత ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులకు ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో రాజ్‌పై బలమైన ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై విచారణ జరిపిన తర్వాత రాజ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…