Ram Charan : బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్‌కి ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ప్రభాస్ చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే కాగా ఒక్కో చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం విడుదలకి సిద్ధం కాగా, ప్రస్తుతం సెట్స్‌పై సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సందీప్ రెడ్డి వంగా చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బడా చిత్రాలే కావడం విశేషం.
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు దేశంలోనే ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఆయన అడుగు జాడలలో రామ్ చరణ్ కూడా పయనించాలని భావిస్తున్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచిన రామ్ చరణ్ ఈ చిత్రం తర్వాత భారీ దర్శకులతో భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తుండడం మెగా అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను మరికొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నాడు. జెర్సీ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ను ఆకర్షించిన గౌతమ్ ఇప్పుడు అదే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గౌతమ్ సినిమాతో పాటుగా సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుంది. పాన్ ఇండియా చిత్రాలతోనే సందడి చేయాలని రామ్ చరణ్ గట్టిగా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…