Sherlyn Chopra : న‌న్ను లైంగికంగా వేధించాడు.. అంటూ శిల్పా శెట్టి భ‌ర్తపై కేసు పెట్టిన హీరోయిన్..

October 17, 2021 2:38 PM

Sherlyn Chopra : పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకి తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. తాజాగా ఆయనకు మరిన్ని కొత్త చిక్కులు రానున్నట్లు తెలుస్తోంది. మోడల్ షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జుహు పోలీస్ స్టేషన్‌‌లో ఈ మేరకు ఆమె రాజ్‌కుంద్రాపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల అశ్లీల చిత్రాల కేసులో చిక్కుకున్నశిల్పా శెట్టి భర్త, బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాపై హీరోయిన్, మోడల్ షెర్లిన్ చోప్రా మొద‌టి నుండి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Sherlyn Chopra filed a case on raj kundra

తనని శిల్పా భర్త రాజ్‌కుంద్రా మోసం చేశాడని, మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తాజాగా పోలీసులకు తెలిపింది. అంతేగాక లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని షెర్లిన్‌ పోలీసులను కోరినట్లు మీడియాతో పేర్కొంది.

రాజ్ కుంద్రా తనను లైంగిక వేధింపులకు కూడా గురి చేశాడని, తమకు వ్యతిరేకంగా ఏదైనా ప్రకటన చేస్తే పరువు నష్టం దావాతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కుంద్రా, శెట్టి తనను బెదిరించారని ఈ ఫిర్యాదులో తెలిపింది. అంతేకాక రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్ తో సంబంధం ఉందని, వారి ద్వారా కూడా తనను బెదిరించారని చెప్పింది.

రాజ్ కుంద్రాపై షెర్లిన్ చోప్రా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తరువాత ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులకు ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో రాజ్‌పై బలమైన ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై విచారణ జరిపిన తర్వాత రాజ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now