Sarkaru Vaari Paata : సూపర్‌స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్‌లు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మహేష్‌కు ఇది వరుసగా నాలుగో విజయం. దీంతో ఆయన ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ మూవీ కొన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని టాక్ వచ్చింది. అయినా సరే సినిమా ఓవరాల్‌గా మాత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తనదైన శైలిలో రివ్యూ చేసి.. ఇందులో ఉన్న లోటుపాట్ల గురించి తెలియజేశారు.
సర్కారు వారి పాట మూవీలో కీర్తిసురేష్, మహేష్‌ల మధ్య ఉన్న సన్నివేశాలు బాగున్నాయని.. వాటిని ఇంకాస్త పొడిగించి ఉంటే బాగుండేదని గోపాలకృష్ణ అన్నారు. కథను సడెన్‌గా మలుపు తిప్పేయడంతో సీరియస్‌గా సాగుతుందని.. అందువల్ల ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త తగ్గిందని అన్నారు. అలా కాకుండా మహేష్, కీర్తిల మధ్య కామెడీ సీన్లను ఇంకా కొన్నింటిని పెట్టి ఉంటే.. సినిమా కచ్చితంగా ఇంకా హిట్ అయ్యేదని.. అలాగే ఇంకో రూ.100 కోట్లను వసూలు చేసేదని అన్నారు.
ఇక సెకండాఫ్ మొత్తం సీరియస్‌గా ఉంటుందని.. అలా కాకుండా కాస్తంత కామెడీ పెట్టి ఉంటే బాగుండేదని అన్నారు. సముద్రఖని, మహేష్ ల మధ్య ఉండే డైలాగ్స్ అంత ఎఫెక్టివ్‌గా లేవని.. ఇవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని తెలిపారు. ఈ మూవీకి పైన తెలిపిన విధంగా కొన్ని మార్పులను చేసి ఉంటే ఇంకా ఎక్కువ వసూలు చేసి ఉండేదని.. అలా ఈ సినిమా రూ.100 కోట్లను మిస్ చేసుకుందని అన్నారు. ఇక ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించిన విషయం విదితమే. త్వరలోనే ఆయన నాగచైతన్యతో సినిమా తీస్తారని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…