Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య తన సినిమా కెరీర్ తొలినాళ్లలో సక్సెస్ కోసం తీవ్రంగా శ్రమించాడు. కానీ తరువాత తానేంటో నిరూపించుకున్నాడు. తొలి సినిమా జోష్ ఫ్లాప్ అయినా.. ఏం మాయ చేశావెతో హిట్ కొట్టాడు. ఆ తరువాత చైతూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్వతహాగా చైతూను అందరూ సౌమ్యుడని పిలుస్తుంటారు. అలాంటి వ్యక్తికి సమంత విడాకులు ఇచ్చిందంటే.. ఆయన ఆమె వల్ల ఎంతటి బాధను అనుభవించాడో అర్థం చేసుకోవచ్చు.. అంటూ అక్కినేని అభిమానులు సమంతను తెగ ట్రోల్ చేశారు. అయితే అది గతం. ఇప్పుడు చైతూ తన పనేంటో తాను చేసుకుంటున్నాడు.
ఇక నాగచైతన్య, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన థాంక్ యూ మూవీ ఈనెల 22వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే వీరు ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక తాజాగా వీరు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చైతూకు సైట్ ఉందని, అందుకనే ఆయన సినిమాల్లో కూడా అప్పుడప్పుడూ కళ్లద్దాలను ధరిస్తుంటాడని.. కానీ దీన్ని చూసి ఆయన స్టైల్ కోసం కళ్లద్దాలను ధరిస్తుంటాడని అనుకుంటారని.. ఇందులో నిజం లేదని తెలిపింది.
ఇక చైతన్య కూడా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తాను, రాశిఖన్నా మంచి ఫ్రెండ్స్ అని.. కానీ తమ గురించి బయట అనేక పుకార్లు వస్తున్నాయని చైతూ తెలిపాడు. తాను ఏ విషయాన్ని అయినా సరే ఆమెతో పంచుకుంటానని తెలిపాడు. కాగా రాశిఖన్నాపై చైతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక థాంక్ యూ మూవీకి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించగా.. ఈ మూవీతో చైతూ హ్యాట్రిక్ సాధిస్తాడని అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…