గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Sarkaru Vaari Paata : అన‌వ‌స‌రంగా రూ.100 కోట్ల‌ను మిస్ చేసుకున్న స‌ర్కారు వారి పాట‌..!

Sarkaru Vaari Paata : సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. మ‌హేష్‌కు ఇది వ‌రుస‌గా నాలుగో విజ‌యం.…

Sarkaru Vaari Paata : అన‌వ‌స‌రంగా రూ.100 కోట్ల‌ను మిస్ చేసుకున్న స‌ర్కారు వారి పాట‌..!

Sarkaru Vaari Paata : సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. మ‌హేష్‌కు ఇది వ‌రుస‌గా నాలుగో విజ‌యం. దీంతో ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ మూవీ కొన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింద‌ని టాక్ వ‌చ్చింది. అయినా స‌రే సినిమా ఓవ‌రాల్‌గా మాత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీపై ప్ర‌ముఖ ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ త‌న‌దైన శైలిలో రివ్యూ చేసి.. ఇందులో ఉన్న లోటుపాట్ల గురించి తెలియ‌జేశారు.

సర్కారు వారి పాట మూవీలో కీర్తిసురేష్‌, మ‌హేష్‌ల మ‌ధ్య ఉన్న స‌న్నివేశాలు బాగున్నాయ‌ని.. వాటిని ఇంకాస్త పొడిగించి ఉంటే బాగుండేద‌ని గోపాల‌కృష్ణ అన్నారు. క‌థ‌ను స‌డెన్‌గా మ‌లుపు తిప్పేయ‌డంతో సీరియ‌స్‌గా సాగుతుంద‌ని.. అందువ‌ల్ల ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాస్త త‌గ్గింద‌ని అన్నారు. అలా కాకుండా మ‌హేష్‌, కీర్తిల మ‌ధ్య కామెడీ సీన్ల‌ను ఇంకా కొన్నింటిని పెట్టి ఉంటే.. సినిమా క‌చ్చితంగా ఇంకా హిట్ అయ్యేద‌ని.. అలాగే ఇంకో రూ.100 కోట్ల‌ను వ‌సూలు చేసేద‌ని అన్నారు.

Sarkaru Vaari Paata missed additional rs 100 crores know how
Sarkaru Vaari Paata

ఇక సెకండాఫ్ మొత్తం సీరియ‌స్‌గా ఉంటుంద‌ని.. అలా కాకుండా కాస్తంత కామెడీ పెట్టి ఉంటే బాగుండేద‌ని అన్నారు. స‌ముద్ర‌ఖ‌ని, మ‌హేష్ ల మ‌ధ్య ఉండే డైలాగ్స్ అంత ఎఫెక్టివ్‌గా లేవ‌ని.. ఇవి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాయ‌ని తెలిపారు. ఈ మూవీకి పైన తెలిపిన విధంగా కొన్ని మార్పుల‌ను చేసి ఉంటే ఇంకా ఎక్కువ వ‌సూలు చేసి ఉండేద‌ని.. అలా ఈ సినిమా రూ.100 కోట్ల‌ను మిస్ చేసుకుంద‌ని అన్నారు. ఇక ఈ మూవీకి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విష‌యం విదిత‌మే. త్వ‌ర‌లోనే ఆయ‌న నాగ‌చైత‌న్య‌తో సినిమా తీస్తార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి