Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట మూవీ ఓటీటీలో.. ఎందులో.. ఎప్పుడు అంటే..?

May 12, 2022 11:30 AM

Sarkaru Vaari Paata : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట మూవీ నేడు (గురువారం మే 12, 2022) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో మ‌హేష్ కు జోడీగా కీర్తి సురేష్ న‌టించింది. ఈ క్ర‌మంలోనే యూఎస్ఏలో ఇప్ప‌టికే సినిమాకు ప్రీమియ‌ర్స్ ప‌డ్డాయి. ఇక ఇండియాలోనూ ఉద‌యం 4 గంట‌ల‌కే బెనిఫిట్ షోల‌ను ప్రారంభించారు. దీంతో 7 గంట‌ల వ‌ర‌కు రివ్యూలు వ‌చ్చేశాయి. ఈ క్ర‌మంలోనే మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వ‌స్తున్నాయి. అయితే ఈ మూవీ విడుద‌లై ఇంకా ఒక్క రోజు కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి ఎప్పుడు వ‌స్తుందా.. అని ప్రేక్ష‌కులు ఆరాలు తీస్తున్నారు. అయితే దీనిపై కూడా అప్‌డేట్ వ‌చ్చేసింది.

స‌ర్కారు వారి పాట మూవీకి గాను మొద‌ట్లో డిస్నీప్ల‌స్ హాట్ స్టార్ డిజిట‌ల్ హ‌క్కుల‌ను కొనుగోలు చేసింద‌ని టాక్ వ‌చ్చింది. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఆ హ‌క్కుల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు. దీంతో అమెజాన్ ప్రైమ్‌లోనే స‌ర్కారు వారి పాట రిలీజ్ కానుంది. ఇక సినిమా విడుద‌ల అయ్యాక నెల రోజుల‌కు.. అంటే జూన్ 12వ తేదీ త‌రువాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంద‌ని తెలుస్తోంది.

Sarkaru Vaari Paata to stream on Amazon Prime
Sarkaru Vaari Paata

అయితే స‌ర్కారు వారి పాట సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స్టార్ మా సొంతం చేసుకుంది. దీంతో ఆ టీవీలో ఈ మూవీ ప్ర‌సారం అవుతుంది. అయితే అంత‌కన్నా ముందే ఓటీటీలో ఈ మూవీ వ‌స్తుంది క‌నుక టీవీల్లో చూసేందుకు పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌రు. అయిన‌ప్ప‌టికీ మూవీ బాగుంద‌ని టాక్ వ‌స్తుంది క‌నుక‌.. టీవీలోనూ ఈ సినిమాకు రేటింగ్స్ వ‌స్తాయ‌ని అంటున్నారు. ఇక స‌ర్కారు వారి పాట‌కు అన్ని సెంట‌ర్ల‌లోనూ మంచి టాక్ వ‌స్తోంది. దీంతో మ‌హేష్ ఇంకో హిట్ సాధించారని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment