Samsung Galaxy A04s : ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తక్కువ బడ్జెట్‌లో మరొక నూతన స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇక ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ ఎగ్జినోస్ 850 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో విడుదలైంది. ఈ ఫోన్‌లో మెమొరీని కార్డు ద్వారా పెంచుకోవచ్చు. 1టీబీ వరకు సపోర్ట్ చేస్తుంది.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఫోన్‌లో లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా.. దీనికి తోడు మరో 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క వైపున అందిస్తున్నారు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎ04ఎస్ స్మార్ట్ ఫోన్ బ్లాక్, గ్రీన్, కాపర్ కలర్ ఆప్షన్‌లలో విడుదల కాగా.. ధర రూ.13,499గా ఉంది. త్వరలోనే ఈ ఫోన్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…