Anasuya Dance : ఓ వైపు బుల్లితెరపై.. మరోవైపు వెండితెరపై.. దూసుకుపోతున్న యాంకర్లు ఎవరైనా ఉంటే.. ఆమె అనసూయ అనే చెప్పవచ్చు. ఈమె ఈ మధ్య కాలంలో తన గ్లామర్ డోసును కాస్త పెంచింది. ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ వెరైటీ దుస్తులను ధరిస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాల్లో బిజీగా అవుదామని చెప్పి అనసూయ జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది. కానీ ఆమె పాత వీడియోలు మాత్రం ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.
జబర్దస్త్‌లో అనసూయ మొదట్నుంచీ యాంకర్‌గా చేసింది. తరువాత కొంత కాలం పాటు దూరమైంది. దీంతో ఆమె స్థానంలో రష్మి జబర్దస్త్‌కు, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు రెండింటికీ యాంకర్‌గా చేసింది. తరువాత కొందరు పాత కంటెస్టెంట్లతోపాటు అనసూయ కూడా జబర్దస్త్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మధ్యే అందులో నుంచి మళ్లీ వెళ్లిపోయింది. దీంతో మళ్లీ ఆమె స్థానం రష్మికే దక్కింది. అయితే జబర్దస్త్ షో ఆరంభం అయ్యేటప్పుడు అనసూయ చేసే డ్యాన్స్ అందరినీ అలరిస్తుంటుంది. అందులో భాగంగానే ఆమె అలా చేసిన డ్యాన్స్‌కు చెందిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అనసూయ అంటేనే మనకు ముందుగా ఆమె చేసే డ్యాన్స్‌తోపాటు ఆమె గ్లామర్ గుర్తుకు వస్తాయి. అప్పట్లో ఆమె రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా కనిపించి అలరించింది. ఆ తరువాత మళ్లీ పుష్ప ద్వారానే ఆమెకు సినిమాల్లో మంచి గుర్తింపు లభించింది. దీంతో పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ పుష్ప తరువాత వచ్చిన ఆమె మూవీలు ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇటీవలే దర్జా అనే మాస్ మూవీతో అనసూయ పలకరించింది. కానీ ఈ మూవీ కూడా ఆమెకు విజయాన్ని అందించలేదు. అయితే త్వరలోనే ఈమె పుష్ప 2 లో పాల్గొననుంది. ఇక ఈ మూవీతో అయినా మరిన్ని అవకాశాలను దక్కించుకుని సత్తా చాటాలని అనసూయ భావిస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…