Samsung Galaxy A04s : భారీ డిస్‌ప్లే, బ్యాట‌రీతో.. శాంసంగ్ గెలాక్సీ ఎ04ఎస్‌.. ధ‌ర ఎంతంటే..?

October 4, 2022 10:05 AM

Samsung Galaxy A04s : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌క్కువ బ‌డ్జెట్‌లో మ‌రొక నూత‌న స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇక ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ ఎగ్జినోస్ 850 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌లో మెమొరీని కార్డు ద్వారా పెంచుకోవ‌చ్చు. 1టీబీ వ‌ర‌కు స‌పోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ 12 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఈ ఫోన్‌లో ల‌భిస్తుంది. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉండ‌గా.. దీనికి తోడు మ‌రో 2 మెగాపిక్స‌ల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ప‌క్క వైపున అందిస్తున్నారు. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి వంటి ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఇందులో ల‌భిస్తుంది.

Samsung Galaxy A04s smart phone launched
Samsung Galaxy A04s

శాంసంగ్ గెలాక్సీ ఎ04ఎస్ స్మార్ట్ ఫోన్ బ్లాక్‌, గ్రీన్‌, కాప‌ర్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో విడుద‌ల కాగా.. ధ‌ర రూ.13,499గా ఉంది. త్వ‌రలోనే ఈ ఫోన్‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్ర‌యించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now