Samantha : జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తున్న సమంత.. మైండ్‌ పోతుంది..!

November 5, 2021 5:55 PM

Samantha : ఏం మాయ చేశావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. నాగచైతన్యను వివాహం చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్న సమంత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుంటామని ప్రకటన చేసింది. ఇక సమంత విడాకుల ప్రకటన అనంతరం పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా ఉంది.

Samantha work out in gym viral video

సమంత త్వరగా చైతన్య జ్ఞాపకాల నుంచి బయట పడి పూర్తిగా తన దృష్టిని తన తదుపరి సినిమాలపై పెట్టింది. అలాగే తన శరీర ఫిట్‌నెస్‌పై దృష్టిసారించినట్లు గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఎక్కువ సమయం జిమ్ లో గడుపుతూ భారీ కసరత్తులు చేస్తోంది. జిమ్‌లో చెమటలు కక్కేలా కష్టపడుతున్నటు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇక సమంత విడాకుల ప్రకటన తర్వాత డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై రెండు చిత్రాలు చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. విడాకుల ప్రకటన తర్వాత సమంత తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. విడాకుల తరువాత సమంత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టడంతో భారీ వర్కౌట్స్ చేస్తూ తన శరీరాన్ని ఫిట్ గా ఉంచడం కోసం ప్రయత్నిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment