Samantha : సమంత – నాగ చైతన్య విడాకుల వ్యవహారాన్ని ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ఆప్యాయంగా ఉండే వీరు సడెన్‌గా డైవోర్స్ తీసుకోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చైతన్య, సమంతల మధ్య ఏం జరిగి ఉంటుంది ? ఎందుకు విడాకులు తీసుకుని ఉంటారు ? అనే వాటిపై జోరుగా చర్చలు కూడా చేస్తున్నారు. అయితే పలువురు ప్రముఖులు డైవోర్స్‌కి ముందు వారు ఎలా ఉండేవాళ్లు, వారి ప్లాన్స్ ఏంటనే విషయాలని బహిర్గతం చేస్తూ వస్తున్నారు.
‘శాకుంతలం’ నిర్మాత నీలిమ గుణ తాజాగా ఆమె ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. చై-సామ్ విడాకులపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. శాకుంతం సినిమా కోసం మా నాన్న సమంతని సంప్రదించినప్పుడు ఆమె సినిమాలు చేయట్లేదని చెప్పింది. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నామని చెప్పిన సమంతకు శాకుంతలం కథ నచ్చడంతో ఓకే చెప్పింది. కొన్ని కండీషన్స్‌తో శాకుంతలం చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత జూలై, ఆగస్ట్ కల్లా షూటింగ్ పూర్తిచేయాలని సామ్ కోరడంతో.. మేము ఓకే చెప్పి అలానే ప్లాన్ చేసుకున్నాం.
పిల్లలని కనాలని అనుకున్న ఈ జంట సడెన్‌గా ఎందుకు విడాకులు తీసుకుంటున్నారనేది అర్ధం కాని ప్రశ్నగా మారిందని చెప్పింది నీలిమ. కాగా, కొద్ది రోజులుగా సమంతపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో పోస్ట్ ద్వారా సామ్ స్పందించిన విషయం తెలిసిందే. విడాకులు అనేది ఎంతో బాధగా ఉంటుంది. ఇలా నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు.. కానీ ఇవేవీ కూడా నన్ను ముక్కలు చేయలేవు. వెనక్కి నెట్టలేవు.. అని సమంత ఎమోషనల్ అయింది. ప్రస్తుతం సామ్ ఓ తమిళ సినిమాతో బిజీగా ఉండగా, రానున్న రోజులలో మూడు సినిమాలు అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…